పాఠశాలల ప్రారంభానికి సర్వం సిద్ధం చేయండి అధికారులకు కలెక్టర్‌ ఎంవీ రెడ్డి ఆదేశం

ABN , First Publish Date - 2021-01-18T04:49:52+05:30 IST

జిల్లాలో ఫిబ్రవరి 1వ తేదీన పాఠశాలలు ప్రారంభించడానికి సర్వ సిద్దం చేయాలని కలెక్టర్‌ ఎంవీ రెడ్డి అధికారులను ఆదేశించారు.

పాఠశాలల ప్రారంభానికి సర్వం సిద్ధం చేయండి  అధికారులకు కలెక్టర్‌ ఎంవీ రెడ్డి ఆదేశం

కొత్తగూడెం కలెక్టరేట్‌, జనవరి 17: జిల్లాలో ఫిబ్రవరి 1వ తేదీన పాఠశాలలు ప్రారంభించడానికి సర్వ సిద్దం చేయాలని కలెక్టర్‌ ఎంవీ రెడ్డి అధికారులను ఆదేశించారు. పాఠశాలలు ప్రారంభించడానికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏర్పాట్లు చేసే ప్రక్రియపై శనివారం రాత్రి కలెక్టరేట్‌ సమా వేశపు హాలు నుంచి విద్య,వైద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల అధికారులు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫ రెన్సు నిర్వహించారు. ఈనెల 18వ తేదీ వరకు పాఠశాలలు నిర్వహణపై కార్యచరణ ప్రణాళిక తయారు చేయాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు పాఠశాలలు పర్యవేక్షణ అధి కారులుగా నియమిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక అధికారులు అన్ని పాఠశాలలు, వసతిగృహాలు తనిఖీ చేయాలన్నారు. ఈనెల 25వ తేదీ వరకు పాఠశాలలు ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయితీ సిబ్బంది, పట్టణ ప్రాంతాల్లో  మున్సిపల్‌  కమిషనర్లు పారిఽశుద్య కార్యక్రమాలు నిర్వహించి పాఠశాలలు పరిశుభ్రం చేయించాలన్నారు. పాఠశాలలు ప్రారంభం నుంచి విద్యార్థులకు మఽధ్యాహ్న భోజనం ఏర్పా టు చేయుటకు బియ్యం సరఫరాకు ఇండెంట్‌ ఇవ్వా లన్నారు. పాఠశాలలు నిర్వహించక చాలా కాలం అవుతు న్నందున నిల్వ ఉన్న నిత్యావసర వస్తువులు వినియోగిం చొద్దన్నారు. విద్యార్ధులు సామాజిక దూరం పాటించే విధంగా ప్రతి తరగతిలో 20 మంది విద్యార్థులను మాత్రమే కూర్చోబెట్టాలన్నారు. ఏదేని వ్యాధి లక్షణాలున్న విద్యార్థు లను గుర్తించి వ్యాధి నిర్దారణకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రతి పాఠశాలలో బాలబాలికలకు ప్రత్యేకంగా  ఐసోలేషన్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రాన్ని తీసుకొనే ప్రక్రియను ఈనెల 19 వరకు పూర్తి చేయాలన్నారు. పోటీ ప్రపంచాన్ని తట్టుకొనేందుకు మన పిల్లలను సన్నద్దం చేసే విధంగా తరగతులు నిర్వహ ణ చాలా ముఖ్యమన్నారు. సమయం తక్కువ ఉన్నందున ఏర్పాట్లు ప్రక్రియను యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. మండల స్థాయిలో తహసీల్దార్లు, ఎంపీడీవో, ఎంఈఓ, మహిళా సమాఖ్యలతో కమిటీ ఏర్పాటు చేసి పాఠశాలల జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. తల్లిదండ్రులు , పాఠశాలల కమిటీ సభ్యులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. పాఠశాలల నుంచి విద్యార్థులు ఇంటి కొచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తపై ప్రతి రోజు ఉపాధ్యాయులు విద్యార్ధులకు చెప్పాలన్నారు. 


Updated Date - 2021-01-18T04:49:52+05:30 IST