Advertisement
Advertisement
Abn logo
Advertisement

నాస్తిక కేంద్రంలో సైన్స్‌ ఎగ్జిబిషన్‌

నాస్తిక  కేంద్రంలో సైన్స్‌ ఎగ్జిబిషన్‌

రామలింగేశ్వర్‌నగర్‌, డిసెంబరు 2 : విద్యార్థుల్లో సైన్సు, శాస్త్రీయ దృష్టి, సృజనాత్మకత పెంపొందిం చేందుకు గోరా సైన్సు సెంటర్‌ కృషి చేస్తుందని సంస్థ డైరెక్టర్‌ జి.నియంత తెలిపారు. బెంజ్‌సర్కిల్‌ వద్ద ఉన్న నాస్తికకేంద్రంలో రెండు రోజుల పాటు సాగే సైన్సు ఎగ్జిబిషన్‌ గురువారం ప్రారంభమైంది. శుక్రవారం కూడా ఎగ్జిబిషన్‌ కొనసాగుతుందని ఆసక్తి కలిగిన విద్యార్థులు పాల్గొనవచ్చునని నియంత తెలిపారు. ఎటువంటి రుసుం దీనికి చెల్లించనవసరం లేదని, హైస్కూల్‌, కాలేజీ, ఇంజనీరింగ్‌, మెడిసన్‌ తదితర విద్యార్థులు విరివిగా కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు. వివరాలకు 9490754655 నెంబర్‌లో సంప్రదించాలని కోరారు.

Advertisement
Advertisement