Advertisement
Advertisement
Abn logo
Advertisement

సృజనాత్మకత వెలికితీతకు వైజ్ఞానిక ప్రదర్శనలు

  • రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి

మేడ్చల్‌ : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు వైఙ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మంగళవారం మేడ్చల్‌ పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా వైఙ్ఞానిక ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు రూపొందించిన వివిధ ప్రదర్శనలు తిలకించి విద్యార్థులను అభినందించారు. అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి వేదికల ద్వారా తమలోని నైపుణ్యాన్ని ప్రదర్శించాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు ప్రయత్నించాలన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌  మల్కాజిగిరి పార్లమెంటు ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఎంపీపీ పద్మజగన్‌ రెడ్డి, మేడ్చల్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మర్రి దీపికా నర్సింహారెడ్డి, వైస్‌చైర్మన్‌ రమేష్‌, డీఈఓ ప్రసాద్‌, కౌన్సిలర్లు, కో ఆప్షన్‌ సభ్యులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement