పాలపుంతకు ఆవల ఆక్సిజన్.. కనుగొన్న శాస్త్రవేత్తలు

ABN , First Publish Date - 2020-02-23T03:17:22+05:30 IST

పాలపుంతకు ఆవల మనిషి శ్వాసించగలిగే ఆక్సిజన్ ఉన్నట్టు ప్రపంచంలోనే తొలిసారి శాస్త్రవేత్తలు కనుగొన్నారు

పాలపుంతకు ఆవల ఆక్సిజన్.. కనుగొన్న శాస్త్రవేత్తలు

న్యూఢిల్లీ: పాలపుంతకు ఆవల మనిషి శ్వాసించగలిగే ఆక్సిజన్ ఉన్నట్టు  ప్రపంచంలోనే తొలిసారి శాస్త్రవేత్తలు కనుగొన్నారు. చైనాలోని షాంఘై ఆస్ట్రోనోమికల్ అబ్జర్వేటరీకి చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ విషయాన్ని కనుగొంది. 581 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న మార్కారియన్ 231 అనే పాలపుంత నుంచి భూమికి చేరిన కాంతి తరంగాలను విశ్లేషించిన శాస్త్రవేత్తల బృందం అక్కడ పరమాణు ఆక్సిజన్ ఉన్నట్టు గుర్తించింది. పాలపుంతతో పోలిస్తే మార్కారియర్ 231పై వంద రెట్ల ఆక్సిజన్ ఉన్నట్టు శాస్త్రవేత్తల బృందం అంచనా వేసింది.


భూ వాతావరణంలోని ఆక్సిజన్ ఇతర వాయువులతో నిండి ఉంటుంది. దీనివల్ల సుదూర పాలపుంతల నుంచి వచ్చే కాంతి తరంగాలను విశ్లేషించడం కొంత కష్టసాధ్యమైన పనే. మన వాతావరణంలో నిండిన ఈ వాయువుల వల్ల ఆ కాంతి తరంగాలు అవశోషణకు గురికావడమో, దారిమళ్లిపోవడమో జరుగుతుంది. దీనివల్ల కచ్చితమైన ఫలితాలను పొందడం కష్టమవుతుందని ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 

Updated Date - 2020-02-23T03:17:22+05:30 IST