Advertisement
Advertisement
Abn logo
Advertisement

మనలో ఒకరు పొడవుగా, మరొకరు పొట్టిగా ఎందుకుంటున్నారో తెలుసా?.. రహస్యాన్ని బయటపెట్టిన శాస్త్రవేత్తలు

మనిషి పొడవు పెరగడంలో జాప్యం, చిన్నవయసులోనే పెద్దవారిగా కనిపించడానికి కారణం ఏమిటి? అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం దీనికి సమాధానం కనుగొంది. మనిషి బ్రెయిన్‌లోని ఒక ప్రత్యేకమైన రిసెప్టర్ దీనికి ప్రధాన కారణమని తేల్చిచెప్పారు. ఈ రిసెప్టర్ మనిషి శరీరపు పొడవు, సెక్స్యువల్ మెచ్యూరిటీకి సంబంధించిన హార్మోన్లను అదుపు చేయడంలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఈ పరిశోధనల్లో కేంబ్రిడ్జి యూనివర్శిటీ, క్వీన్ మేరీ యూనివర్శిటీ, బ్రటన్ యూనివర్శిటీ, మిచిగన్ యూనివర్శిటీ, వండర్ బిల్ట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. 

ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్తలు మాట్లాడుతూ బ్రెయిన్‌లోని హైపోథాలమిక్ న్యూరాన్లు కలిగిన ప్రాంతంలో మిల్లెనోకోర్టిన్-3 రిసెప్టర్ (MC3R)ను గుర్తించామని, ఇదే మనిషి పొడవు పెరుగుదల, సెక్సువల్ మెచ్యూరిటీని కంట్రోల్ చేస్తుందన్నారు. ఈ రిసెప్టర్ సరిగా పనిచేయకపోతే మనిషి తగినంత పొడవు పెరగడని,  ఆలస్యంగా యవ్వనంలోకి అడుగుపెడతాడని చెప్పారు. అంతర్జాతీయ పరిశోధకుల బృందం ఈ పరిశోధనలో 5 లక్షల మందిని భాగస్వాములను చేసింది. కేంబ్రిడ్జి యూనివర్శిటీ పరిశోధకుడు సర్ స్టీఫెన్ ఓ రహిలీ మాట్లాడుతూ బ్రెయిన్ వరకూ చేరే పోషకతత్వాల  ఆధారంగా మనిషి పొడవు, సెక్సువల్ డెవలప్‌మెంట్ ఆధారపడివుంటుంది. కాగా ఈ పరిశోధన ఫలితాలు పలు విధాలుగా ఉపయోగపడతాయని అన్నారు. రిసెప్టర్ మెరుగ్గా పనిచేసేందుకు అవసరమయ్యే ఔషధాల తయారీకి మార్గం ఏర్పడుతుందన్నారు. ఫలితంగా మనుషుల పొడవు పెరుగుదలలో సమస్యలను నియంత్రించగలుగుతామన్నారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement