నూతన వంగడాలతో అధిక దిగుబడులు

ABN , First Publish Date - 2021-10-22T04:56:42+05:30 IST

మినుము, పెసర నూతన వంగడాలతో అధిక దిగుబడులు సాధ్యమని అచార్య రంగ యూనివర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్‌ విజయ అభినందన్‌ అన్నారు.

నూతన వంగడాలతో అధిక దిగుబడులు
పంట పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు

నల్లజర్ల, అక్టోబరు 21: మినుము, పెసర నూతన వంగడాలతో అధిక దిగుబడులు సాధ్యమని అచార్య రంగ యూనివర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్‌ విజయ అభినందన్‌ అన్నారు. ఆహార భద్రత మిషన్‌లో భాగంగా గురువారం ప్రకాశరావుపాలెం, పుల్లలపాడు గ్రామాల్లో మినుము, పెసర పంటలను ఉం డి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు పరిశీలించారు. మినుము టీబీజీ–104 ఎకరానికి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందన్నారు. ఈ వంగడం పల్లాకు తెగులు తట్టుకుంటుందన్నారు. ఉండి కేవీకే అధిపతి ఎన్‌.మల్లికార్జున్‌, ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్‌ కె.ఫణికుమార్‌, ఏవో కమల్‌రాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T04:56:42+05:30 IST