స్కోడా ఆక్టావియా లిమిటెడ్‌ ఎడిషన్‌ ధర రూ.35.99 లక్షలు

ABN , First Publish Date - 2020-02-28T07:24:50+05:30 IST

స్కోడా ఆటో ఇండియా తన ఆక్టావియా మోడల్‌లో లిమిటెడ్‌ ఎడిషన్‌ ‘ఆక్టావియా ఆర్‌ఎస్‌ 245’ను గురువారంనాడు...

స్కోడా ఆక్టావియా లిమిటెడ్‌ ఎడిషన్‌ ధర రూ.35.99 లక్షలు

న్యూఢిల్లీ: స్కోడా ఆటో ఇండియా తన ఆక్టావియా మోడల్‌లో లిమిటెడ్‌ ఎడిషన్‌ ‘ఆక్టావియా ఆర్‌ఎస్‌ 245’ను గురువారం నాడు మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.35.99 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌). మార్చి 1వ తేదీ నుంచి దీనికి ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ను కంపెనీ ప్రారంభించనుంది. రూ.లక్ష చెల్లించి బుక్‌ చేసుకోవాల్సి ఉంటుం ది. కేవలం 200 కార్లను మాత్రమే విక్రయించనున్నట్టు కంపెనీ తెలిపింది.

Updated Date - 2020-02-28T07:24:50+05:30 IST