తల్లుల ఖాతాలకే ఉపకార వేతనాలు

ABN , First Publish Date - 2020-12-04T05:50:57+05:30 IST

మహిళా సాధికారత కోసం తల్లుల ఖాతాలకే విద్యార్థుల ఉపకార వేతనాలను ప్రభుత్వం జమ చేస్తున్నదని అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ అధికారి (ఏఎస్‌డబ్ల్యూవో) డీఎల్‌ ఆనందరాజ్‌ చెప్పారు.

తల్లుల ఖాతాలకే ఉపకార వేతనాలు
సమావేశంలో మాట్లాడుతున్న ఆనంద్‌రాజ్‌

ఏఎస్‌డబ్ల్యూవో ఆనంద్‌రాజ్‌


చోడవరం, డిసెంబరు 3: మహిళా సాధికారత కోసం తల్లుల ఖాతాలకే విద్యార్థుల ఉపకార వేతనాలను ప్రభుత్వం జమ చేస్తున్నదని అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ అధికారి (ఏఎస్‌డబ్ల్యూవో) డీఎల్‌ ఆనందరాజ్‌ చెప్పారు. స్థానిక ఉషోదయ  కళాశాలలో గురువారం విద్యార్థుల తల్లిదండ్రులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపకార వేతనాలను తల్లుల ఖాతాలకు జమ చేయడం వల్ల పిల్లల చదువుపై వారికి అవగాహన ఏర్పడుతుందన్నారు. ఈ సందర్భంగా జీవో 64పై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. సమావేశంలో బీసీ వెల్ఫేర్‌ అధికారి డి.నాగరాజు, ఉషోదయ కళాశాల చైర్మన్‌ జె.రమణాజీ, డీన్‌ ఎస్‌వీ వాసు, సోషల్‌ వెల్ఫేర్‌ అధికారులు రఘు, ఈశ్వరరావు, లక్ష్మీ నారాయణ, మాధవి పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-04T05:50:57+05:30 IST