కరోనా భయం లేకుండా తేళ్ల పండుగ

ABN , First Publish Date - 2020-08-11T18:14:33+05:30 IST

కరోనా భయం లేకుండా కర్నూలు జిల్లా వాసులు తేళ్ల పండుగ జరుపుకున్నారు.

కరోనా భయం లేకుండా తేళ్ల పండుగ

కర్నూలు జిల్లా: కరోనా భయం లేకుండా కర్నూలు జిల్లా వాసులు తేళ్ల పండుగ జరుపుకున్నారు. కోడుమూరులో కొండలరాయుడి తేళ్ల పండుగ వైభవంగా జరిగింది. కొండపై కొలువైన వెంకటేశ్వరస్వామికి తేళ్లతో అభిషేకం చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్నారు. కోడుమూరు శివారులోని వెంకటేశ్వరస్వామికి ఏటా శ్రావణమాసంలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రావణమాసంలో మూడో సోమవారం కొండరాళ్ల కింద ఉన్న తేళ్లను పట్టుకుని స్వామి వారికి అభిషేకం నిర్వహిస్తారు.


ఈ ఏడాది కరోనా ప్రభావం ఉన్నా.. భక్తులు వెనుకంజ వేయలేదు. చిన్నారులు, పెద్దలు, మహిళలు అంతా తరలి వెళ్లి ఆలయ పరిసరాల్లో ఉన్న తేళ్లను పట్టుకున్నారు. వాటికి దారం కట్టారు. కొబ్బరికాయలు, పూలమాలలతోపాటు తేళ్లనుకూడా వెంకటేశ్వరస్వామి విగ్రహంపై విడిచి స్వామివారికి నైవేథ్యం సమర్పించారు. సాధారణంగా ఈ కొండపై ఉన్న తేళ్లు ఎవరినీ కుట్టవు. ఒకవేళ కుట్టినా.. ఆలయం చుట్టూ మూడు ప్రదర్శనలు చేస్తే ఏమీ కాదని భక్తుల విశ్వాసం.

Updated Date - 2020-08-11T18:14:33+05:30 IST