స్కాట్లాండ్‌ జెర్సీ డిజైనర్‌.. 12 ఏళ్ల చిన్నారి

ABN , First Publish Date - 2021-10-21T09:23:50+05:30 IST

సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్‌ జట్ల కిట్‌ డిజైన్‌ కోసం మల్టీ బ్రాండెడ్‌ సంస్థలు పోటీపడుతుంటాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి సదరు జట్టు ఆటగాళ్ల జెర్సీలను రూపొందిస్తుంటాయి.

స్కాట్లాండ్‌ జెర్సీ డిజైనర్‌..  12 ఏళ్ల చిన్నారి

దుబాయ్‌: సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్‌ జట్ల కిట్‌ డిజైన్‌ కోసం మల్టీ బ్రాండెడ్‌ సంస్థలు పోటీపడుతుంటాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి సదరు జట్టు ఆటగాళ్ల జెర్సీలను రూపొందిస్తుంటాయి. కానీ, ఇందుకు భిన్నంగా  ఓ 12 ఏళ్ల బాలిక క్రికెట్‌ జట్టు జెర్సీని డిజైన్‌ చేసి వార్తల్లోకెక్కింది. వివరాల్లోకెళ్తే.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ పోరులో ఇప్పటికే వరుసగా రెండు విజయాలతో సూపర్‌-12 దశకు చేరువలో నిలిచిన స్కాట్లాండ్‌ జట్టు ఈమారు కొత్త జెర్సీతో ఆడాలనుకుంది. అయితే, జెర్సీ ప్రత్యేకంగా ఉండాలన్న ఆలోచనతో చిన్నారులకు అవకాశం కల్పించింది. జెర్సీ డిజైన్‌ కోసం దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాల చిన్నారులను ఆహ్వానించగా.. వీరిలో హాడింగ్టన్‌కు చెందిన 12 ఏళ్ల బాలిక రెబెకా డౌనీ విజేతగా నిలిచింది. స్కాట్లాండ్‌ జాతీయ చిహ్నం ‘ది థిస్టిల్‌’ రంగులైన ముదురు నీలం, ఊదా రంగులతో కాస్త ప్రత్యేకమైన జెర్సీని రెబెకా తయారుచేసింది. క్రికెట్‌ బోర్డుకు ఇది తెగ నచ్చేయడంతో ఆ చిన్నారి డిజైన్‌ చేసిన జెర్సీతోనే స్కాట్లాండ్‌ ఆటగాళ్లు ప్రపంచక్‌పలో పోటీపడుతున్నారు. 

Updated Date - 2021-10-21T09:23:50+05:30 IST