ఉచితంగా నెలసరి వస్తువులు.. పార్లమెంటులో బిల్లుకు ఆమోదం

ABN , First Publish Date - 2020-11-26T09:53:53+05:30 IST

స్కాట్లాండ్‌లోని మహిళలు, బాలికలకు నెలసరి వస్తువుల(శానిటరీ ప్యాడ్స్, ట్యాంపన్స్)ను ఉచితంగా అందించేలా

ఉచితంగా నెలసరి వస్తువులు.. పార్లమెంటులో బిల్లుకు ఆమోదం

ఎడిన్‌బర్గ్: స్కాట్లాండ్‌లోని మహిళలు, బాలికలకు నెలసరి వస్తువుల(శానిటరీ ప్యాడ్స్, ట్యాంపన్స్)ను ఉచితంగా అందించేలా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. స్కాట్లాండ్ పార్లమెంట్‌లో ఈ బిల్లును ప్రవేశపెట్టగా అందరి మద్దతుతో మంగళవారం బిల్లు పాస్ అయ్యింది. ఈ సందర్భంగా మంత్రి నికోలా స్టర్జియన్ మాట్లాడుతూ.. మహిళలకు, బాలికలకు ఇది ముఖ్యమైన పాలసీ అని అన్నారు. చట్టంలో భాగంగా ప్రభుత్వం ఇకపై మహిళలు, బాలికలకు నెలసరి వస్తువులను ఉచితంగా అందించనుంది. కాగా.. ప్రపంచవ్యాప్తంగా ఏ ఒక్క దేశం కూడా మహిళలకు నెలసరి వస్తువులను ఉచితంగా అందించడం లేదు. నెలసరి వస్తువులను అందిస్తున్న మొట్టమొదటి దేశంగా స్కాట్లాండ్ రికార్డు సృష్టించింది. ఇక ఈ వస్తువులను ఉచితంగా అందించడం ద్వారా ప్రతి ఏడాది ప్రభుత్వానికి రూ. 236 కోట్ల ఖర్చు కానుంది.

Updated Date - 2020-11-26T09:53:53+05:30 IST