సముద్రం నుంచి హఠాత్తుగా బయటకు వచ్చిన వింత ఆకారాలు.. భయంతో కేకలు పెట్టిన సందర్శకులు.. ఇంతకీ అవి ఏమిటంటే..

ABN , First Publish Date - 2021-10-31T16:06:24+05:30 IST

సముద్ర తీరప్రాంతాల్లో ఉన్నవారు ఆహ్లాదం కోసం..

సముద్రం నుంచి హఠాత్తుగా బయటకు వచ్చిన వింత ఆకారాలు.. భయంతో కేకలు పెట్టిన సందర్శకులు.. ఇంతకీ అవి ఏమిటంటే..

సముద్ర తీరప్రాంతాల్లో ఉన్నవారు ఆహ్లాదం కోసం తరచూ బీచ్ లకు వస్తుంటారు. సముద్రాన్ని చూసి మైమరచిపోతుంటారు. అయితే సముద్ర ఒడ్డున సేద తీరుతున్నప్పుడు ఉన్నట్టుండి సముద్రంలో నుంచి భారీ ఆకారం కనిపిస్తే మీకేమనిపిస్తుంది? గుండెదడ పట్టుకుంటుంది కదా..  సరిగ్గా ఇటువంటి ఘటనే వేల్స్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే వేల్స్ పరిధిలోని హోలీ హెడ్ న్యూయారీ బీచ్‌లో ఈ వింత దృశ్యం సందర్శకుల కంటపడింది. 


వీరు మూడు సముద్ర భూతాలను చూసి భయంతో కేకలు పెట్టారు. ఎప్పుడూ అలాంటి ఆకారాలు చూడని వీరు అనారోగ్యం పాలయ్యారు. అయితే సముద్రంలో కనిపించిన  ఇవి పాత లైఫ్ బోట్ ర్యాంప్‌కు చెందిన చెక్కలని తేలింది. చాలా కాలంపాటు అవి అక్కడే ఉండటంతో వాటిపై చెత్త పేరుకొనిపోయింది. వాటిని చూడగానే ఎవైనా సరే సముద్రపు భూతాలుగా భావిస్తుంటారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. 

Updated Date - 2021-10-31T16:06:24+05:30 IST