సముద్ర సింహం

మోహన్‌ లాల్‌ నటించిన చిత్రం ‘మరక్కార్‌’. అరేబియా సముద్ర సింహం అనేది ఉపశీర్షిక. అర్జున్‌, సునీల్‌ శెట్టి, సుదీప్‌ కీలక పాత్రలు పోషించారు. ప్రియదర్శన్‌ దర్శకుడు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ తెలుగులో ఈ చిత్రాన్ని డిసెంబరు 3న విడుదల చేస్తోంది. ‘‘మోహన్‌లాల్‌ కి తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. ‘జనతా గ్యారేజ్‌’తో ఆయన తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ‘మన్యం పులి’ తెలుగులో మంచి వసూళ్లని అందుకుంది. ‘మరక్కార్‌’పై కూడా భారీ అంచనాలున్నాయి. వాటిని మేం తప్పకుండా అందుకుంటాం. మోహన్‌లాల్‌ పై తెరకెక్కించిన యాక్షన్‌ ఘట్టాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ’’ అని చిత్రబృందం తెలిపింది. ప్రభు, మంజూవారియర్‌, కీర్తి సురేష్‌, కల్యాణి ప్రియదర్శన్‌ తదితరులు నటించారు.


Advertisement