మారడోనా వైద్యుడి ఆఫీసులో సోదాలు

ABN , First Publish Date - 2020-12-01T09:40:38+05:30 IST

ఫుట్‌బాల్‌ దిగ్గజం డీగో మారడోనా మృతిపై దర్యాప్తు చేస్తున్న అర్జెంటీనా పోలీసులు అతడి వ్యక్తిగత వైద్యుడు లియోపొల్డో లూకీ కార్యాలయంలో సోమవారం సోదాలు నిర్వహించారు.

మారడోనా వైద్యుడి ఆఫీసులో సోదాలు

బ్యూన్‌సఎయిర్స్‌: ఫుట్‌బాల్‌ దిగ్గజం డీగో మారడోనా మృతిపై దర్యాప్తు చేస్తున్న అర్జెంటీనా పోలీసులు అతడి వ్యక్తిగత వైద్యుడు లియోపొల్డో లూకీ కార్యాలయంలో సోమవారం సోదాలు నిర్వహించారు. లూకీతో పాటు మారడోనా కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి కూడా పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. ‘మారడోనా వైద్య రికార్డులు భద్రపరుస్తున్నాం. సాధారణ దర్యాప్తులో భాగంగానే లూకీ కార్యాలయంలో సోదాలు నిర్వహించాం’ అని పోలీసు అధికారులు తెలిపారు. ఇక, ఇటీవల బ్రెయిన్‌ సర్జరీ చేయించుకున్న మారడోనా గత బుధవారం గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-12-01T09:40:38+05:30 IST