గాడిదలు, గుర్రాల కోసం గాలింపు.. ఎందుకంటే..!

ABN , First Publish Date - 2021-03-08T19:00:24+05:30 IST

ఆ జిల్లాలోని పశ్చిమకనుమలకు చేరువగా 30కి పైగా గిరిజన గ్రామాలు ఉన్నాయి. ..

గాడిదలు, గుర్రాల కోసం గాలింపు.. ఎందుకంటే..!

చెన్నై : తేని జిల్లాలో వాహనాలు వెళ్లడానికి వీలులేని గిరిజన గ్రామాలకు ఎన్నికల సరంజామాను తరలిచేందుకు గాడిదలు, గుర్రాల కోసం ఎన్నికల అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆ జిల్లాలోని పశ్చిమకనుమలకు చేరువగా 30కి పైగా గిరిజన గ్రామాలు ఉన్నాయి. వీటిలో పది గ్రామాలకు రోడ్డుసదుపాయం లేదు. కాలినడక దారిలోనే గిరిజనులు వెళుతుంటారు. ఈ గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల పరికరాలను తరలించేందుకు అధికారులు గాడిదలు, గుర్రాలను ఉపయోగిస్తుంటారు. ఈ జిల్లాలో వంద శాతం పోలింగ్‌ జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆ మేరకు కొండపైనున్న గ్రామాలకు ఎలక్ర్టానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు, పోలింగ్‌ సిబ్బందికి అవసరమైన ఫర్నీచర్‌, పుస్తకాలు, వాటర్‌ బాటిల్స్‌, అట్టపెట్టెలు తదితర సామగ్రిని తరలించేందుకు గాడిదలు, గుర్రాలను అద్దెకు తీసుకోమంటూ ఎన్నికల సంఘం అధికారులకు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దీనితో తేని కొండ గ్రామాల్లో ఎన్నికల డ్యూటీ చేయనున్న సిబ్బంది అప్పుడే గాడిదలు, గుర్రాల కోసం వెతుకుతున్నారు.

Updated Date - 2021-03-08T19:00:24+05:30 IST