Abn logo
Jul 5 2020 @ 05:18AM

రోగమొస్తే.. చిక్కులే!

ఒకవైపు కరోనా.. మరోవైపు సీజనల్‌ వ్యాధుల విజృంభణ

జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో ఆసుపత్రులకు వెళితే ‘నో ఎంట్రీ’ 

సాధారణ రోగులకు అష్టకష్టాలు


(అమలాపురం-ఆంధ్రజ్యోతి): ఒకవైపు కరోనా మహమ్మారి.. మరోవైపు వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కార ణంగా సంభవిస్తున్న సీజనల్‌ వ్యాధులతో రోగులు విలవిల్లాడిపోతున్నారు. ఏ ఆసు పత్రికి వెళ్లినా వైద్య సేవలు అందించేందుకు వైద్యులు నిరాకరిస్తున్న పరిస్థితులు ఎదురవుతున్నాయి. వర్షాకాల సీజన్‌ ప్రారంభం కావడంతో ఎప్పుడూ వచ్చే సాధా రణ జ్వరాలు, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉన్నట్టు చెబుతుంటే చాలు ప్రైవేటు ఆసుపత్రుల సిబ్బంది, వైద్యులు హడలెత్తిపోతున్నారు. కరోనా పరీక్ష చేయించుకుని నెగిటివ్‌ వస్తేనే వైద్యసేవలు అందిస్తామని చెబుతుండడంతో రోగులు ప్రభుత్వాసు పత్రుల వద్ద పరీక్షల కోసం బారులు తీరుతున్నారు. కాకినాడ, రాజమహేంద్రవరం వంటి ప్రాంతాలకు తీసుకువెళ్లేందుకు అంబులెన్సులు ముందుకు రావడం లేదంటే పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.


జూన్‌, జూలై నెలలు ప్రారంభం నుంచే సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తాయి. ముఖ్యంగా జూలై నెలను వైద్యుల పరి భాషలో డెంగ్యూ, మలేరియా నెలగా పరిగణిస్తారు. ఈ సీజన్‌లో డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలు, డయేరియా, జ్వరం, జలుబు, దగ్గు వంటి వ్యాధులు సర్వసాధారణంగా విజృంభిస్తుంటాయి. ఆయా ప్రాంతాల్లో తాగునీటి కాలు ష్యం, పరిసరాల అపరిశుభ్రత, దోమల పెరుగుదల వంటి కారణాల వల్ల ఈ రోగాలు వస్తాయి. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్‌ వంటి వ్యాధుల వల్ల ప్రాణాంతక సమస్యలు కూడా చుట్టుముట్టే ప్రమాదం ఉంది. డెంగ్యూ కారణంగా ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ తగ్గిపోయి రోగి విషమ పరి స్థితికి వెళ్లే అవకాశము ఉంది. ప్రస్తుతం ఈ తరహా రోగా ల్లో భాగంగా జ్వరపీడితుల సంఖ్య జిల్లాలో రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా జ్వరపీడి తులుగా మారుతున్నారు. వీరిని ఆసుపత్రులకు వైద్యం కోసం తీసుకువెళితే ఆసుపత్రిలో వైద్యులు చేర్చుకునేం దుకు నిరాకరిస్తున్నారు. ఇక సామాన్య రోగుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. వివిధ రోగాలతో ఏ ఆసుప త్రికి వెళ్లినా వైద్యం చేసేందుకు ససేమిరా నిరాకరిస్తు న్నారు.


ఇందుకు కారణం జిల్లాలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారే. అనుమానిత లక్షణాలతో కొవిడ్‌ పరీక్షల కోసం అమలాపురం ఏరియా ఆసుపత్రితోపాటు వివిధ ప్రభుత్వాసుపత్రులు, పీహెచ్‌సీల ముందు క్యూలు కడు తున్నారు. రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా ప్రైవేటు ఆసుపత్రుల్లో జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉన్న వ్యక్తులకు వైద్య సేవలు అం దించలేమని కొన్నిచోట్ల బోర్డులు సైతం పెడుతున్నారు. ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రుల్లో సాధారణ రోగులకు వైద్య సేవలు అందించేలా చూడాలని కోరుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement