మూడు రోజుల్లో 6 వేల లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం

ABN , First Publish Date - 2021-07-24T03:31:00+05:30 IST

బోగోలు మండలం కప్పరాళ్లతిప్ప గ్రామ సమీపంలోని జామాయి ల్‌తోట, శ్మశాన వాటిక, నక్కల గుంట, ఉప్పుకాలువ పరిసర ప్రాంతాల్లో కావలి సెబ్‌ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో శుక్రవారం విస్తృత దాడులు నిర్వహించారు.

మూడు రోజుల్లో 6 వేల లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం
బెల్లపు ఊట డ్రమ్ములతో సెబ్‌ సీఐ శ్రీనివాసులు

బిట్రగుంట, జూలై 23: బోగోలు మండలం కప్పరాళ్లతిప్ప గ్రామ సమీపంలోని జామాయి ల్‌తోట, శ్మశాన వాటిక, నక్కల గుంట, ఉప్పుకాలువ పరిసర ప్రాంతాల్లో కావలి సెబ్‌ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో శుక్రవారం విస్తృత దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భూమిలో పాతి ఉంచిన 10 డ్రమ్ములో సారా తయారీకి నిల్వ ఉంచిన రెండు వేల లీటర్ల బెల్లపు ఊటను  ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా సెబ్‌ సీఐ మాట్లాడుతు జిల్లా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో, జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీలక్ష్మి ఆదేశాల మేరకు మూడు రోజులుగా నిర్వహిస్తున్న దాడుల్లో  ఆరువేల లీటర్లకు పైగా బెల్లపు ఊటను ధ్వంసం చేశామన్నారు. దాడులు చేసే కొద్ది నాటు సారా కాపుదారులు కొత్తకొత్త ప్రాంతాలను ఎంచుకుని భూమిలో ఇనుప డ్రమ్ములు పాతిపెట్టి బెల్లపు ఊటను కనిపించకుండా చేస్తున్నారని తెలిపారు. పూర్తి స్థాయిలో నాటు సారా నిర్మూలనే ధ్యేయంగా సిబ్బందితో కలసి దాడులు చేస్తూనే ఉంటామని, తయారీ దారులు ఇకనైనా ప్రవర్తన మార్చుకోవాలని కోరారు.



Updated Date - 2021-07-24T03:31:00+05:30 IST