ట్రావెల్‌ బస్సులో 22 కేజీల గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2021-07-29T05:41:58+05:30 IST

మార్టూరు మండలంలోని బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు తని ఖీ చేస్తుండగా బస్సులో ప్రయాణికులు తరలిస్తు న్న గంజాయితోపాటు దానికి సంబంధించిన మ త్తు పదార్థాలను పట్టుకున్నట్లు సూపరింటెండెంట్‌ స్పెషల్‌ బ్యూరో ఎ.ఆవులయ్య చెప్పారు.

ట్రావెల్‌ బస్సులో 22 కేజీల గంజాయి పట్టివేత
పట్టుబడిన గంజాయి, మత్తుపదార్థాలతో వివరాలు వెల్లడిస్తున్న అధికారులు

విలువ రూ.3లక్షలు పైమాటే

ఇతర మత్తు పదార్థాలు కూడా స్వాధీనం

ఎస్‌ఈబీ అధికారుల తనిఖీల్లో గుట్టురట్టు


పర్చూరు, జూలై 28 : మార్టూరు మండలంలోని బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు తని ఖీ చేస్తుండగా బస్సులో ప్రయాణికులు తరలిస్తు న్న గంజాయితోపాటు దానికి సంబంధించిన మ త్తు పదార్థాలను పట్టుకున్నట్లు సూపరింటెండెంట్‌ స్పెషల్‌ బ్యూరో ఎ.ఆవులయ్య చెప్పారు. పర్చూరు ఎస్‌ఈబీ స్టేషన్‌లో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. డైరెక్టర్‌ ఆఫ్‌ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో విజయవాడ వారి ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి 11 ను ంచి 2 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 14 ఎస్‌ఈ బీ స్టేషన్‌ పరిధిలో తనిఖీలు చేపట్టామన్నారు. బొల్లాపల్లి టోల్‌ ప్లాజా వద్ద బిహార్‌ నుంచి కూలీలతో చెన్నైలోని కోయంబత్తూరు ఎన్‌ఎ్‌సపీ స్పి న్నింగ్‌ మిల్‌కు కార్మికులను తీసుకుపోతున్న ట్రా వెల్‌ బస్సును ఆపి తనిఖీ చేసినట్లు చెప్పారు. అ ందులో 22 కేజీల గంజాయితోపాటు మత్తు ప దార్థాలైన 58 పచ్చరంగు ప్లాస్టిక్‌ ప్యాకెట్‌లలో మునక్కా, 59 నల్లరంగు ప్లాస్టిక్‌ డబ్బాలలోని ము నక్కా, ఒక కేజీ బంగ్‌ తదితరాలైన, 4.51 కేజీలు, 0.650 కేజీల గంజాయి సంబంధిత మత్తు పదార్థాలను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నామన్నారు. మత్తుపదార్థాలను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించినట్లు తెలిపారు. వీటి మొత్తం విలువ రూ.3లక్షల వరకు ఉంటుందన్నా రు. ఆ బస్సులో ఒడిస్సా, బిహార్‌ రాష్ట్రాలకు సంబ ంధించిన వారు 90 మంది ఉన్నట్లు చెప్పారు. అ ందులో 46 మంది స్పిన్నింగ్‌ మిల్‌ కార్మికులన్నా రు. మిగిలిన 44 మంది వివిధ ప్రాంతాలకు చెం దిన వ్యక్తులని చెప్పారు. అక్రమ గంజాయితోపా టు ఇతర మత్తు పదార్థాల తరలింపునకు సంబంధించి నలుగురు వ్యక్తులపై 1985 ఎన్‌డీపీఎ్‌స గంజాయి, డ్రగ్స్‌ సెక్షన్‌ కింద కేసు నమోదు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఒంగోలు సుధీర్‌బాబు, ఎస్‌ఈబీ సీఐ ఎం.యశోధరాదేవి, ఎస్సై జి.శివరాంప్రసాద్‌, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-07-29T05:41:58+05:30 IST