Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇన్ఫోసిస్‌ అనుబంధ సంస్థలపై సెబీ నిషేధం

న్యూఢిల్లీ: ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలపై ఇన్ఫోసి్‌సకు చెందిన 8 అనుబంధ సంస్థల వర్కింగ్‌ భాగస్వాముల క్యాపిటల్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ కార్యకలాపాలను సెబీ నిషేధించింది. తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని ప్రకటించింది. వాటిలో రెండు సంస్థలు క్యాపిటల్‌ పార్ట్‌నర్స్‌, టెసోరా క్యాపిటల్‌ అక్రమంగా ఆర్జించిన రూ.3.06 కోట్ల లాభాన్ని కూడా స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. 2020 జూన్‌ 30వ తేదీతో ముగిసిన త్రైమాసికానికి అప్రచురిత డేటా ఆధారంగా ఆ సంస్థలు ఇన్ఫోసిస్‌ షేర్లలో క్రయ  విక్రయాలు జరిపి లాభపడ్డాయనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని సెబీ పేర్కొంది. వారితో పాటు ఇన్ఫోసిస్‌ సీనియర్‌ కార్పొరేట్‌ న్యాయవాది ప్రన్షు భూత్రా, కార్పొరేట్‌ అకౌంటింగ్‌ గ్రూప్‌ సీనియర్‌ ప్రిన్సిపల్‌ వీవీ వెంకట సుబ్రమణియంలపై కూడా సెబీ నిషేధం విధించింది. 


ఇన్ఫోసిస్‌ అంతర్గత దర్యాప్తు

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలపై తమ ఉద్యోగులు ఇద్దరిని సెక్యూరిటీ మార్కెట్‌ నుంచి సెబీ నిషేధించిన నేపథ్యంలో ఆ అంశంపై అంతర్గత దర్యాప్తు చేపడుతున్నట్టు ఇన్ఫోసిస్‌ ప్రకటించింది. సెబీకి పంపిన ఈ- మెయిల్‌ సందేశంలో ఇన్ఫోసిస్‌ ఈ ప్రకటన చేసింది. దర్యాప్తులో వారు తప్పు చేసినట్టు తేలితే తగు చర్య తీసుకోనున్నట్టు కూడా తెలిపింది. 

Advertisement
Advertisement