ఎన్‌డీటీవీ ప్రమోటర్లపై సెబీ ఆంక్షలు

ABN , First Publish Date - 2020-11-29T07:15:00+05:30 IST

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వ్యవహారంలో ఎన్‌డీటీవీ ప్రమోటర్లు ప్రణయ్‌ రాయ్‌, రాధికా రాయ్‌ సహా మరికొందరిపై మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది...

ఎన్‌డీటీవీ ప్రమోటర్లపై సెబీ ఆంక్షలు

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వ్యవహారంలో ఎన్‌డీటీవీ ప్రమోటర్లు ప్రణయ్‌ రాయ్‌, రాధికా రాయ్‌ సహా మరికొందరిపై మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది. రెండేళ్ల పాటు సెక్యూరిటీ మార్కెట్లో వీరు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండా నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పన్నెండేళ్ల క్రితం నాటి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కేసులో వీరు ఆయాచితంగా రూ.16.97 కోట్ల మేర లబ్ధి పొందినట్లు వెల్లడి కావటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెబీ తెలిపింది. 2006 సెప్టెంబరు నుంచి 2008 జూన్‌ మధ్య కాలంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నిబంధనలను ఉల్లఘించినట్లు గుర్తించామని, దీంతో వీరిపై ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.  

Updated Date - 2020-11-29T07:15:00+05:30 IST