నిమ్మగడ్డ రమేశ్‌కు ఇప్పుడు ఏమైంది?

ABN , First Publish Date - 2021-03-03T01:14:37+05:30 IST

నిమ్మగడ్డ రమేశ్‌కు ఇప్పుడు ఏమైంది?

నిమ్మగడ్డ రమేశ్‌కు ఇప్పుడు ఏమైంది?

అమరావతి: నాలుగు, ఐదు నెలల కాలంలో ఆయన పేరు నిజానికి దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఎన్నికల సంఘం సాధికారితను.. రాజ్యాంగం.. ఎన్నికల సంఘానికి ఇచ్చిన అధికారాన్ని కాపాడుకోవడానికి ఆయన చేసిన పోరాటం అనన్యసామాన్యమైనది. ఎవరూ తప్పుపట్టలేరు కూడా. ఒక దశలో టీఎన్ శేషన్‌లాంటి అత్యున్నతమైన అధికారితో పోల్చారు. ఎంతమంది తిట్టినా, వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరగాల్సిందేనని, పట్టుబట్టి న్యాయవ్యవస్థను ఉపయోగించుకుని కోర్టుకు వెళ్లి కూడా గెలిచి మొత్తం మీద ఎన్నికలు జరిగేంత వరకూ ఆయనను అలాగే చూశారు. ఎన్నికల కమిషనర్‌గా ఇప్పటికే ఆయనను అలాగే చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఈ క్రతవు ప్రారంభమయ్యే వరకు అధికార పక్షం తప్ప అన్ని పక్షాలు ఆయనకు అండగా నిలిచారు. ఆ తర్వాత ఎక్కడో ఏదో మెతక వైఖరి వచ్చింది. రెండో విడత ఎన్నికల నుంచి పంచాయతీల్లో జరుగుతున్న అక్రమాలను ఎన్నికల కమిషన్ అడ్డుకోలేకపోయింది. చివరికి కౌంటింగ్ కేంద్రాలను కూడా కబ్జా చేసేసి.. కరెంట్ తీసేసి మరీ అర్ధరాత్రి ఫలితాలు మార్చేస్తుంటే.. అవతలి వాడు గెలిచినట్టు ప్రకటిస్తుంటే ఎన్నికల కమిషన్ చోద్యం చేస్తుందనే విమర్శ ప్రతిపక్షాల నుంచి వచ్చింది.


ఇలాంటి పరిణామాల నేపథ్యంలో  ‘‘ప్రజాస్వామ్యం కోసం పోరాడిన నిమ్మగడ్డకు ఇప్పుడు ఏమైంది?. ఎన్నికల నిర్వహణలో ఫెయిలవుతున్నారనే ఆరోపణలు ఎందుకు వచ్చాయి?. ఏకంగా జగన్‌తో రాజీపడ్డారని విపక్షాలు ఎందుకు అనుమానిస్తున్నాయి?. నిమ్మగడ్డ నిర్ణయాలపై ఏపీ గవర్నర్ ప్రభావం పడిందనే విమర్శలకు కారణమేంటి?. నిజంగానే రాజ్యాగానికి విరుద్ధంగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారా?. ’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 

Updated Date - 2021-03-03T01:14:37+05:30 IST