రెండో రోజు 104.. తమదే గెలుపంటున్న కాంగ్రెస్

ABN , First Publish Date - 2020-07-14T18:32:06+05:30 IST

వాస్తవానికి మెజారిటీ కావాల్సింది 101 మాత్రమే. కాంగ్రెస్ వద్ద అంత కంటే ఎక్కువే ఉన్నట్లు ఈ సంఖ్యలను చూస్తే తెలుస్తోంది. ఇది నిజమే అయితే ఒక వేళ బలపరీక్షకు వెళ్లినా కాంగ్రెస్ జయకేతనమే ఎగరవేసే అవకాశాలే ఉన్నాయి

రెండో రోజు 104.. తమదే గెలుపంటున్న కాంగ్రెస్

జైపూర్: రాజస్తాన్ కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో 104 ఎమ్మెల్యేలు పాల్గొన్నట్లు సమాచారం. సోమవారం జరిగిన మొదటి సమావేశంలో సైతం ఇదే సంఖ్యలో ఎమ్మెల్యేలు పాల్గొన్నట్లు ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్ ప్రకటించారు. కాగా వరుసగా రెండు రోజు సమావేశానికి వందకు పైగా ఎమ్మెల్యేలు పాల్గొనడంతో రాజస్తాన్ ప్రభుత్వానికి వచ్చే నష్టమేం లేదనే తెలుస్తోంది.


వాస్తవానికి మెజారిటీ కావాల్సింది 101 మాత్రమే. కాంగ్రెస్ వద్ద అంత కంటే ఎక్కువే ఉన్నట్లు ఈ సంఖ్యలను చూస్తే తెలుస్తోంది. ఇది నిజమే అయితే ఒక వేళ బలపరీక్షకు వెళ్లినా కాంగ్రెస్ జయకేతనమే ఎగరవేసే అవకాశాలే ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ రెబల్ నేత సచిన్ పైలెట్ తన వద్ద 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెబుతున్నారు. ఇరు పక్షాల నంబర్లకు ఏమాత్రం పొంతన లేకుండా ఉంది.


జైపూర్‌లోని ఫేయిర్‌మంట్ హోటల్‌లో జరిగిన సీఎల్పీ సమావేశానికి భారీ సంఖ్యలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కాంగ్రెస్ చెబుతున్నట్లు 100కు పైగా ఉన్నారా లేదా అనే స్పష్టత ఇంకా రాలేదు.

Updated Date - 2020-07-14T18:32:06+05:30 IST