Advertisement
Advertisement
Abn logo
Advertisement

అరకు ఆస్పత్రిలో రెండో ఆక్సిజన్‌ ప్లాంట్‌అరకులోయ, డిసెంబరు 4: అరకులోయ ఏరియా ఆసుపత్రిలో రెండో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నారు. సెకండ్‌ వేవ్‌లో మన్యంలో కరోనా రోగులు ఆక్సిజన్‌ అందక చాలామంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆక్సిజన్‌ ప్లాంట్‌లు అవసరమని గుర్తించిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా రెండు ఆక్సిజన్‌ ప్లాంట్‌లను మంజూరు చేశాయి. తొలుత కేంద్రం సమకూర్చిన ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ఇటీవలే ప్రధానమంత్రి భోపాల్‌లో వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మరో ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం మిషనరీ వచ్చింది. వీటికి అవసరమైన షెడ్‌, విద్యుత్‌ కనెక్షన్‌ వంటి పనులు పూర్తి చేయాల్సి ఉంది. మరో నెలన్నర రోజుల్లో రెండో ప్లాంట్‌ అందుబాటులోకి రానుంది. తొలుత ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ ప్లాంట్‌కు అవసరమైన విద్యుత్‌ సరఫరా పూర్తి స్థాయిలో జరగక పనిచేయడం లేదు. ఇక.. రెండో ప్లాంట్‌ సిద్ధమైనా విద్యుత్‌ సమస్య వెంటాడనున్నది. ఈ విషయాన్ని గుర్తించిన ఏరియా ఆసుపత్రి వైద్యులు హైపవర్‌ ట్రాన్సఫార్మర్‌లను ఏర్పాటు చేయాలని ఏపీ ఈపీడీసీఎల్‌ అధికారులకు దరఖాస్తు చేశారు. హైపవర్‌ విద్యుత్‌ను సరఫరా చేయకుంటే ఆక్సిజన్‌ ప్లాంట్లు అలంకరప్రాయంగా ఉండేపోయే అవకాశం ఉంది. 


Advertisement
Advertisement