Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 20 2021 @ 07:59AM

రెండో విడత metro పనులు ప్రారంభం

                    - వన్‌వేగా పురుషవాక్కం హైవే


ప్యారీస్‌(chennai): స్థానిక పురుషవాక్కంలో రెండవ విడత మెట్రోరైలు పనులు జరుగుతున్న కారణంగా మంగళవారం పురుషవాక్కం హైవేను వన్‌వేగా మార్చినట్టు నగర ట్రాఫిక్‌ విభాగం పోలీసులు తెలిపారు. ఈ మార్గంలో 128 రైల్వేస్టేషన్లు, సొరంగమార్గం పనులు జరుగుతున్న కారణంగా ఈ పనులకు ఆటంకం లేకుండా పురుషవాక్కం హైరోడ్డును వన్‌వేగా మార్చినట్టు వారు తెలిపారు. కెల్లీస్‌ మీదుగా పురుషవాక్కం వైపు వెళ్లే వాహనాలు నాగప్ప రోడ్డు, కీల్పాక్‌ బెయిన్‌ స్కూల్‌ మీదుగా ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లేలా వసతి కల్పించారు.

Advertisement
Advertisement