సిరీస్ పై ఇంగ్లండ్‌ కన్ను

ABN , First Publish Date - 2020-08-13T09:23:11+05:30 IST

తొలి టెస్ట్‌లో సాధించిన అద్భుత విజయంతో ఉత్సాహం మీదున్న ఇంగ్లండ్‌ సిరీ్‌సపై కన్నేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పాకిస్థాన్‌తో

సిరీస్ పై ఇంగ్లండ్‌ కన్ను

పాకిస్థాన్‌తో నేటినుంచి రెండో టెస్ట్‌

మధ్యాహ్నం 3.30 నుంచి సోనీ సిక్స్‌లో...


సౌతాంప్టన్‌: తొలి టెస్ట్‌లో సాధించిన అద్భుత విజయంతో ఉత్సాహం మీదున్న ఇంగ్లండ్‌  సిరీ్‌సపై కన్నేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పాకిస్థాన్‌తో గురువారం ఇక్కడ ప్రారంభమయ్యే రెండో టెస్ట్‌లోనూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఆల్‌రౌండర్‌ స్టోక్స్‌ కుటుంబ కారణాలతో ఈ టెస్ట్‌తోపాటు చివరి మ్యాచ్‌కూ దూరమయ్యాడు. అతడి స్థానంలో ఓలీ రాబిన్సన్‌ను తీసుకున్నారు. అయితే స్టోక్స్‌ స్థానాన్ని ఈ ససెక్స్‌ పేసర్‌ ఏమేరకు భర్తీ చేస్తాడో చూడాలి. రొటేషన్‌ పద్ధతి ప్రకారం జాక్‌ క్రాలే, సామ్‌ కర్రాన్‌ జట్టులోకి వచ్చే అవకాశముంది. మరోవైపు పాకిస్థాన్‌ టీమ్‌ మొదటి టెస్ట్‌లో ఆధిపత్యం చెలాయించినా విజయం దక్కకపోవడంతో ఆ జట్టు ఆటతీరుపై స్వదేశంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సిరీస్‌ను నిలబెట్టుకోవాలంటే పాక్‌ జట్టు పరాజయ భారాన్ని పక్కనబెట్టి సిద్ధం కావాల్సి ఉంటుంది. మరోవైపు తొలి టెస్ట్‌లో తన నాయకత్వంపై పాక్‌ మాజీల నుంచి తీవ్ర విమర్శలు ఎదురైన నేపథ్యంలో..అజర్‌ అలీ ఈ మ్యాచ్‌లో  జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలి. మాంచెస్టర్‌లా కాకుండా ఇక్కడి పిచ్‌ పచ్చికతో కళకళలాడుతోంది. దాంతో ఇరు జట్ల పేస్‌ బౌలర్లు కీలకం అయ్యే అవకాశముంది. కాగా..మ్యాచ్‌ ఐదు రోజులూ వర్షంపడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.  

Updated Date - 2020-08-13T09:23:11+05:30 IST