తడబడి.. నిలబడి

ABN , First Publish Date - 2020-07-17T09:12:35+05:30 IST

సిరీ్‌సను సమం చేయాలనే కసితో రెండో టెస్టు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరుస్తోంది. అయితే ఆరంభంలోనే రెండు వరుస వికెట్లతో పాటు కెప్టెన్‌

తడబడి.. నిలబడి

 ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్ 207/3 

సిబ్లే, స్టోక్ హాఫ్‌ సెంచరీలు

విండీ్‌సతో రెండో టెస్టు


సిరీ్‌సను సమం చేయాలనే కసితో రెండో టెస్టు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరుస్తోంది. అయితే ఆరంభంలోనే రెండు వరుస వికెట్లతో పాటు కెప్టెన్‌ రూట్‌ కూడా స్వల్ప స్కోరుకే వెనుదిరగడంతో ఆతిథ్య జట్టు కష్టాల్లో పడినట్టుగా కనిపించింది. కానీ విండీస్‌ సహనాన్ని పరీక్షిస్తూ  ఓపెనర్‌ సిబ్లే, ఆల్‌రౌండర్‌ స్టోక్స్‌ నిలకడగా రాణించి నాలుగో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని అందించారు. ఫలితంగా ఇంగ్లండ్‌ భారీ స్కోరుపై దృష్టి సారించింది.


మాంచెస్టర్‌: వెస్టిండీ్‌సతో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్‌ నిలకడను ప్రదర్శిస్తోంది. ఓపెనర్‌ డొమినిక్‌ సిబ్లే (86 బ్యాటింగ్‌), బెన్‌ స్టోక్స్‌ (59 బ్యాటింగ్‌) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. దాదాపు ఒకటిన్నర సెషన్‌లు ఆడిన ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు అజేయంగా 126 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఫలితంగా గురువారం తొలిరోజు ఆటలో ఇంగ్లండ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లకు 207 పరుగులు చేసింది. చేజ్‌కు రెండు, జోసె్‌ఫకు ఓ వికెట్‌ దక్కింది.  

2 బంతుల్లో 2 వికెట్లు: భారీవర్షం కారణంగా మైదానం చిత్తడిగా మారడంతో మ్యాచ్‌ గంటన్నర ఆలస్యంగా మొదలైంది. టాస్‌ గెలిచిన వెంటనే విండీస్‌ కెప్టెన్‌ హోల్డర్‌ ఫీల్డింగ్‌కే మొగ్గు చూపాడు. వాతావరణం అనుకూలంగా ఉండడంతో విండీస్‌ ఆరంభం నుంచే పేస్‌ అటాకింగ్‌ చేసింది. అయితే నలుగురు పేసర్లు దాడి చేసినా ఓపెనింగ్‌ జోడీ జో బర్న్స్‌, సిబ్లే ఆచితూచి ఆడింది. దీంతో వ్యూహం మార్చిన హోల్డర్‌ స్పిన్నర్‌ను బరిలోకి దించగా లంచ్‌ విరామానికి ముందు 14వ ఓవర్‌ రెండో బంతికి ఓపెనర్‌ బర్న్న్‌ (15)ను స్పిన్నర్‌ చేజ్‌ ఎల్బీగా అవుట్‌ చేశాడు. ఆ వెంటనే ఇరు జట్లు లంచ్‌ విరామానికి వెళ్లాయి. వచ్చీరాగానే అదే ఓవర్‌లో మూడో బంతికి క్రాలే డకౌట్‌ కావడంతో ఇంగ్లండ్‌ షాక్‌కు గురైంది. ఈ దశలో జో రూట్‌ (23)తో కలిసి సిబ్లే ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా తన 91వ బంతికి సిబ్లే తొలి ఫోర్‌ సాధించాడు. డ్రింక్స్‌ బ్రేక్‌ వరకు వీరి ఆట సజావుగా సాగినా ఆ తర్వాత రూట్‌ రూపంలో విండీస్‌ భారీ వికెట్‌ సాధించింది. అనవసర షాట్‌కు యత్నిస్తూ రెండో స్లిప్‌లో రూట్‌.. హోల్డర్‌కు క్యాచ్‌ ఇవ్వగా మూడో వికెట్‌కు 52 రన్స్‌ భాగస్వామ్యం ముగిసింది. ఇక.. సిబ్లే, స్టోక్స్‌ ఓపిగ్గా ఆడి వికెట్‌ పడకుండా 112/3 స్కోరుతో టీబ్రేక్‌కు వెళ్లారు.

శతక భాగస్వామ్యం: చివరి సెషన్‌లో ఇంగ్లండ్‌దే ఆధిపత్యం సాగింది. సిబ్లే అర్ధసెంచరీ పూర్తిచేసుకోవడంతో పాటు అటు స్టోక్స్‌ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలతో స్కోరు వేగం పెంచాడు. కాగా.. 66వ ఓవర్‌లో తన క్యాచ్‌ను హోల్డర్‌ వదిలేయడం సిబ్లేకు కలిసొచ్చింది. మరోవైపు 71వ ఓవర్‌లో స్టోక్స్‌ అర్ధసెంచరీతో పాటు నాలుగో వికెట్‌కు అజేయంగా వంద పరుగుల భాగస్వామ్యం కూడా జత చేరింది. ఎలాంటి రిస్కీ షాట్లకు వెళ్లకుండా వికెట్‌ను కోల్పోకూడదనే రీతిలో సాగిన ఈ జోడీ ఆటతీరుతో ఇంగ్లండ్‌ 200 ప్లస్‌ స్కోరును సాధించి తొలిరోజును ఆశాజనకంగా ముగించింది.


స్కోరుబోర్డు

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: బర్న్స్‌ (ఎల్బీ) చేజ్‌ 15; సిబ్లే (బ్యాటింగ్‌) 86; క్రాలే (సి) హోల్డర్‌ (బి) చేజ్‌ 0; రూట్‌ (సి) హోల్డర్‌ (బి) జోసెఫ్‌ 23; స్టోక్స్‌ (బ్యాటింగ్‌) 59; ఎక్స్‌ట్రాలు: 24; మొత్తం: 82 ఓవర్లలో 207/3. వికెట్ల పతనం: 1-29, 2-29, 3-81. బౌలింగ్‌: రోచ్‌ 20-4-37-0; గాబ్రియెల్‌ 10-1-32-0; జోసెఫ్‌ 15-3-41-1; హోల్డర్‌ 20-8-33-0; చేజ్‌ 16-1-53-2; బ్రాత్‌వైట్‌ 1-0-1-0.

Updated Date - 2020-07-17T09:12:35+05:30 IST