Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘ఆటో’కు రెండో వేవ్‌ దెబ్బ

మేలో భారీగా పడిపోయిన అమ్మకాలు


న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ కంపెనీలకు మళ్లీ కష్టకాలం మొదలైంది. కొవిడ్‌ రెండో ఉధృతితో మే నెలలో అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న లాక్‌డౌన్లు, ప్లాంట్ల మూసివేత ఇందుకు ప్రధాన కారణం. ఈ ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో మారుతి, హ్యుండయ్‌ వంటి అగ్రశ్రేణి కంపెనీల అమ్మకాలు 49 నుంచి 75 శాతం పడిపోయాయి. గత ఏడాది మే నెలలో లాక్‌డౌన్‌ కారణంగా కంపెనీల కార్యకలాపాలు నిలిచిపోయిన సంగతి విదితమే.


మారుతి సుజుకీ ఇండియా: ఈ ఏడాది మే నెలలో మారుతి సుజుకీ.. డీలర్లకు 35,293 వాహనాలు మాత్రమే సరఫరా చేసింది. అంతకు ముందు నెలతో పోలిస్తే ఇది 75 శాతం తక్కువ. మే 1 నుంచి 16 రోజుల పాటు కొన్ని ప్లాం ట్లు మూసివేయడం ఇందుకు కారణం. ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో ఆల్టో, ఎస్‌-ప్రెస్సో కార్ల అమ్మకాలు 81 శాతం, స్విఫ్ట్‌, సెలేరియో, ఇగ్నిస్‌, బాలెనో, డిజైర్‌ వంటి కాంపాక్ట్‌ కార్ల అమ్మకాలు 72 శాతం, విటారా, బ్రెజ్జా, ఎర్టిగో, ఎస్‌-క్రాస్‌ వం టి యుటిలిటీ వాహనాల అమ్మకాలు 75 శాతం తగ్గాయి. 


హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా: ఏప్రిల్‌ నెల విక్రయా లు 49,002గా ఉండగా మే నెలలో ఇవి 25,001కు (49 శాతం) పడిపోయాయి. 


టాటా మోటార్స్‌: ఏప్రిల్‌లో ఈ కంపెనీ దేశీయ మార్కె ట్లో 25,095 కార్లు విక్రయించింది. మే నెల వచ్చేసరికి అమ్మకాలు 40 శాతం పడిపోయి 15,181కు చేరాయి. 


ఎం అండ్‌ ఎం: మే నెలలో కేవలం 8,004 వాహనాలను విక్రయించింది. ఏప్రిల్‌తో పోలిస్తే ఇది 56 శాతం తక్కువ. 


టయోటా కిర్లోస్కర్‌: ఏప్రిల్‌ నెలలో 9,622 వాహనాలు విక్రయించిన ఈ సంస్థ మేలో కేవలం 707 వాహనాలతో సరిపెట్టుకుంది. ఇక హోండా కార్స్‌ 2,032 యూనిట్లు, ఎంజీ మోటార్‌ 1,016 యూనిట్లను మాత్రమే విక్రయించాయి. 


ద్విచక్ర వాహనాలదీ అదేబాట: హీరో మోటోకార్ప్‌.. మే నెలలో కేవలం 1,83,044 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఏప్రిల్‌ నెలతో పోల్చితే విక్రయాలు 51 శాతం పడిపోయాయి. కాగా హోండా మోటార్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎ్‌సఐ) విక్రయాలు కూడా 28 శాతం తగ్గి 38,763 యూనిట్లుగా నమోదయ్యాయి. బజాజ్‌ ఆటో మే నెలలో 2,71,862 యూనిట్లను విక్రయించింది. 

Advertisement
Advertisement