Abn logo
Jun 15 2021 @ 03:17AM

‘సచివాలయం’ సిబ్బంది ఆందోళన

మహారాణిపేట (విశాఖపట్నం), జూన్‌ 14: గ్రామ/వార్డు సచివాలయం తమకు కల్పించిన అధికారాలు తమకే చెందాలని పట్టణ శానిటేషన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ కార్యదర్శులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలియజేశారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పలువురు కార్యదర్శులు మీడియాతో మాట్లాడారు. మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ జారీచేసిన జీవో ప్రకారం తాము రోజుకు కనీసం మూడు గంటలపాటు క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించాల్సి ఉన్నా.. రోజుకు ఎనిమిది గంటలు క్షేత్రస్థాయిలోనే పనిచేస్తున్నామన్నారు. ప్రభుత్వం తమ సమస్యల పరిష్కరించాలన్నారు.