Secunderabad విధ్వంసం కేసులో దర్యాప్తు ముమ్మరం

ABN , First Publish Date - 2022-06-21T00:01:08+05:30 IST

సికింద్రాబాద్ (Secunderabad) విధ్వంసం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అల్లర్లలో హైదరాబాద్లో 6 అకాడమీల మేనేజర్లు పాత్ర ఉన్నట్లు గుర్తించారు.

Secunderabad విధ్వంసం కేసులో దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్: సికింద్రాబాద్ (Secunderabad) విధ్వంసం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అల్లర్లలో హైదరాబాద్లో 6 అకాడమీల మేనేజర్లు పాత్ర ఉన్నట్లు గుర్తించారు. సాయి డిఫెన్స్ అకాడమీ మేనేజర్లు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. 12 చోట్ల సాయి డిఫెన్స్ అకాడమీల కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. సాయి డిఫెన్స్ అకాడమీ మేనేజర్ల ద్వారా అభ్యర్థులను రెచ్చగొట్టినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. సికింద్రాబాద్ అల్లర్లకు సంబంధించి ఇప్పటికే సాయి డిఫెన్స్ అకాడమీ ఛైర్మన్ ఆవుల సుబ్బారావు (Subbarao) పై పలు ఆరోపణలు వచ్చాయి. ఆయనను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కేసు నమోదు చేయలేదు. త్వరలో తెలంగాణ పోలీసులు కూడా సుబ్బారావును అదుపులోకి తీసుకోనున్నారు. 


అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతమయ్యే ప్రమాదముందనే కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో.. తెలంగాణ పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. ప్రైవేట్‌ డిఫెన్స్‌ అకాడమీలపై తెలంగాణ పోలీసులు దృష్టిసారించారు. అకాడమీ నిర్వాహకుల కదలికలపై నిఘా పెట్టారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్లతో పాటు ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌లలో పోలీ్‌సస్టేషన్ల వారీగా అకాడమీ నిర్వాహకుల వివరాలను సేకరించారు. ప్రస్తుతం అకాడమీల్లో ఎంత మంది అభ్యర్థులు శిక్షణపొందుతున్నారు? రక్షణశాఖ ఇటీవల రద్దు చేసిన సైనిక నియామక ర్యాలీలో ఎంత మంది అర్హత సాధించారు? అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఎవరైన మాట్లాడుతున్నారా? అని ఆరా తీస్తున్నారు. 

Updated Date - 2022-06-21T00:01:08+05:30 IST