Advertisement
Advertisement
Abn logo
Advertisement

సికింద్రాబాద్‌లో కారు దగ్ధం

హైదరాబాద్/రెజిమెంటల్‌బజార్‌: ఆకస్మికంగా మంటలు చెలరేగి కారు దగ్ధమైంది, మార్కెట్‌ ఎస్‌ఐ రమే్‌షనాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. సివిల్‌ ఇంజనీర్‌ శివశంకర భాస్కర రాంలాల్‌ మంగళవారం వారం తార్నాక నుంచి బంజారాహిల్స్‌ కారులో వెళ్తున్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌ ఫ్లై ఓవర్‌  పై నుంచి వెళ్తుండగా కారు ఏసీ నుంచి పొగ రావడం గమనించి వెంటనే కారు దిగారు. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో కారు కాలిపోయింది. సమాచారం అందుకున్న  సికింద్రాబాద్‌ ఫైర్‌ ఆఫీసర్‌ మోహన్‌రావు, సిబ్బంది ఫైరింజన్‌తో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనతో ఫ్లై ఓవర్‌పై ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దగ్ధమైన కారును మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 

Advertisement
Advertisement