జర భద్రం!

ABN , First Publish Date - 2022-01-18T09:00:47+05:30 IST

భయపడినట్టుగానే రాష్ట్రం మళ్లీ కరోనా గుప్పిట్లోకి చేరుకుంటోంది. రెండు వారాల క్రితం వరకు

జర భద్రం!

  • రాష్ట్రంలో దూకుడు పెంచిన వైరస్‌
  • 18 శాతానికి చేరిన పాజిటివిటీ రేటు
  • ప్రభుత్వ నిర్లక్ష్యంతో పెరుగుతున్న కేసులు
  • పండగ సీజన్‌లో అధికార పార్టీ నేతల హడావుడి
  • కోడి పందేల బరులు, పేకాట శిబిరాలు ఏర్పాటు
  • లక్షల్లో జనాలను పోగేసి కార్యక్రమాల నిర్వహణ
  • విద్యాసంస్థలతో ప్రమాదమంటున్న నిపుణులు
  • లోకేశ్‌, సీపీఐ రామకృష్ణకు పాజిటివ్‌.. సజ్జలకూ?
  • రాష్ట్రంలో కొత్తగా 4,108 మందికి వైరస్‌

  •  
  • అమరావతి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): భయపడినట్టుగానే రాష్ట్రం మళ్లీ కరోనా గుప్పిట్లోకి చేరుకుంటోంది. రెండు వారాల క్రితం వరకు వంద మార్కుకి పడిపోతూ వచ్చిన కొవిడ్‌ కేసులు ఒక్కసారిగా వేగం పెంచాయి. నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల సంఖ్య చూస్తే ప్రమాద ఘంటికలు మోగుతున్నట్టు అనిపిస్తోంది. ఈ నెల 14న 11.39గా ఉన్న పాజిటివిటీ రేటు రోజురోజుకూ పెరిగి సోమవారానికి ఏకంగా 18 శాతానికి ఎగబాకింది. కరోనా కేసులు పెరుగుతుండడంతో యాక్టివ్‌ కేసులు కూడా 30,182కి చేరుకున్నాయి. ఈ నెల 3న రాష్ట్రంలో అత్యల్పంగా 122 కేసులు, 1,278 యాక్టివ్‌ కేసులు మాత్రమే ఉన్నాయి. అంటే ఈ 14 రోజుల్లోనే రాష్ట్రంలో కొత్తకేసులు దాదాపు 34 రెట్లు పెరిగాయి. ఇవన్నీ ఆరోగ్యశాఖ వెల్లడించిన అధికారిక లెక్కలు మాత్రమే. అనధికారికంగా ఈ సంఖ్య మూడింతలు అధికంగా ఉండొచ్చని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ విడతలో విశాఖపట్నం, చిత్తూరు జిల్లాల్లో పరిస్థితి అదుపుతప్పింది. గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లోనూ పరిస్థితి ఆందోళకరంగానే ఉంది. మిగిలిన జిల్లాల్లో కూడా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. కరోనా వైరస్‌ ఉధృతంగా పెరగడానికి ప్రభుత్వ నిర్లక్ష్యధోరణి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

  • మనకంటే ముందు మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడుల్లో కరోనా కేసులు అధికమవుతున్న సమయంలోనే ప్రజల్ని అప్రమత్తం చేస్తూ.. కట్టుదిట్టమైన ఆంక్షలు అమలు చేయకుండా తాత్సారం వహించింది. ఇప్పుడు కేసులు పెరుగుతున్న తరుణంలో నేటి నుంచి రాత్రి పూట కర్ఫ్యూ అమల్లోకి తీసుకొచ్చింది. కానీ, దీనివల్ల ఉపయోగం లేదు. జనం విచ్చలవిడిగా తిరిగే పగటి వేళ వదిలేసి.. అందరూ ఇళ్లకు చేరి హాయిగా నిద్రపోయే సమయం (రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటలవరకు)లో కర్ఫ్యూ విధించడం వలన ప్రయోజనం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలు సాధ్యం కాని పరిస్థితి. లాక్‌డౌన్‌ విధిస్తే సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు కాకుండా ప్రజలంతా తప్పనిసరిగా మాస్క్‌ ధరించేలా, తరచూ చేతులు శుభ్రం చేసుకునేలా, జనం గుంపులుగా చేరకుండా చర్యలు తీసుకోవాలని, ఎవరైనా అతిక్రమిస్తే జరిమానాలు విధించాలని నిపుణులు సూచిస్తున్నారు.

  • పండగకు అధికార పార్టీ నేతల హడావిడి..
  • రాష్ట్రంలో కరోనా కేసులు అంచనాలకు మించి పెరుగుతున్నాయి. ఈ సమయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రజాప్రతినిధులు కరోనాను పక్కన పెట్టేశారు. సంక్రాంతి సందర్భంగా స్వయంగా అధికార పార్టీకి చెందిన నేతలే కోడి పందాల బరులు, పేకాట శిబిరాలు భారీఎత్తున ఏర్పాటు చేశారు. కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమగోదావరి కోడిపందాలు, రాయలసీమలో ఎండ్లపందాల నిర్వహణకు వైసీపీ నేతలు పోటీపడ్డారు. దీని వల్ల వైరస్‌ మరింతగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్న ఆందోళన నెలకొంది. 

  • పాఠశాలలు అత్యంత ప్రమాదం..
  • పాఠశాలలు, కళాశాలల విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది.  విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రకటనలు చూస్తుంటే కరోనా పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది. మొద టి, రెండో దశ కరోనా పరిస్థితులను పరిశీలిస్తే.. పాఠశాలు, కళాశాలల వల్ల ఊహించని స్థాయిలో  కేసులు వెలుగులోకొచ్చాయి. విద్యార్థుల వల్ల ఇంట్లోని పెద్ద వారు అధికంగా కరోనాకు గురయ్యారు. అనేక మంది మృత్యువాత పడ్డారు. కళ్ల ముందు ఇన్ని ఉదాహరణలు ఉన్నప్పటికీ ప్రభుత్వ పెద్దలు మాత్రం కళ్లు తెరవడం లేదు. మూడోదశ కరోనా చిన్నారులపై ఎక్కువ ప్రభావం చూపుతుందని వైద్యలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడమే మంచిదన్న సూచనలు వినిపిస్తున్నారు.

  • విద్యార్థులు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పంపించేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. కానీ ప్రభుత్వం మాత్రం పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదని చెబుతోంది. కొత్త వేరియంట్‌ వేగంగా ఎఫెక్ట్‌ అవుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం మరో పది రోజులు ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే మళ్లీ లాక్‌డౌన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


  • కూడా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. కరోనా వైరస్‌ ఉధృతంగా పెరగడానికి ప్రభుత్వ నిర్లక్ష్యధోరణి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మనకంటే ముందు మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడుల్లో కరోనా కేసులు అధికమవుతున్న సమయంలోనే ప్రజల్ని అప్రమత్తం చేస్తూ.. కట్టుదిట్టమైన ఆంక్షలు అమలు చేయకుండా తాత్సారం వహించింది. ఇప్పుడు కేసులు పెరుగుతున్న తరుణంలో నేటి నుంచి రాత్రి పూట కర్ఫ్యూ అమల్లోకి తీసుకొచ్చింది. కానీ, దీనివల్ల ఉపయోగం లేదు. జనం విచ్చలవిడిగా తిరిగే పగటి వేళ వదిలేసి.. అందరూ ఇళ్లకు చేరి హాయిగా నిద్రపోయే సమయం (రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటలవరకు)లో కర్ఫ్యూ విధించడం వలన ప్రయోజనం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలు సాధ్యం కాని పరిస్థితి. లాక్‌డౌన్‌ విధిస్తే సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు కాకుండా ప్రజలంతా తప్పనిసరిగా మాస్క్‌ ధరించేలా, తరచూ చేతులు శుభ్రం చేసుకునేలా, జనం గుంపులుగా చేరకుండా చర్యలు తీసుకోవాలని, ఎవరైనా అతిక్రమిస్తే జరిమానాలు విధించాలని నిపుణులు సూచిస్తున్నారు.












  •  


  • లోకేశ్‌, రామకృష్ణకు కరోనా 

  • సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా కొవిడ్‌?

  • అమరావతి, విశాఖపట్నం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తనకు జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలేమీ లేవని.. అయినా కొవిడ్‌ తగ్గేవరకు హోం ఐసొలేషన్‌లో ఉంటానని ఆయన వెల్లడించారు. ఇటీవల తనను కలిసినవారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు కూడా కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన స్వల్ప లక్షణాలతో హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డికి కరోనా పాజిటివ్‌ అని పార్టీ వర్గాల్లో, ఉద్యోగ సంఘాల్లో ప్రచారం జరుగుతోంది. కరోనా పాజిటివ్‌ కారణంగానే ఉద్యోగ సంఘాల నేతలతో సజ్జల ఫోన్‌లో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిసింది. అయితే.. ఈ విషయాన్ని సజ్జలగానీ.. పార్టీ గానీ అధికారికంగా వెల్లడించలేదు. కాగా.. విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున కరోనా బారినపడ్డారు. మూడు రోజులుగా ఆయన ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. 
  •  

Updated Date - 2022-01-18T09:00:47+05:30 IST