భద్రతకు భరోసా!

ABN , First Publish Date - 2020-03-07T07:55:38+05:30 IST

మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన గ్యాడ్జెట్‌ ఇది. పర్సనల్‌ అలారం రిస్ట్‌లెట్‌గా పిలిచే ఈ గ్యాడ్జెట్‌ను హ్యాండ్‌బ్యాగ్‌లో...

భద్రతకు భరోసా!

ఆపద ఎదురైనప్పుడు మహిళలకు వెంటనే సహాయం అందకపోవచ్చు. చుట్టూ ఎవరూ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వెంట ఉన్న గ్యాడ్జెట్లే మిమ్మల్ని కాపాడుతాయి. మీకు సంబంధించిన అత్యవసర సందేశాన్ని ఆప్తులకు చేరవేస్తాయి. మీకు పర్సనల్‌ వెపన్స్‌గానూ ఉపకరిస్తాయి. అలాంటి గ్యాడ్జెట్లు కొన్ని...




పర్సనల్‌ అలారం

మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన గ్యాడ్జెట్‌ ఇది. పర్సనల్‌ అలారం రిస్ట్‌లెట్‌గా పిలిచే ఈ గ్యాడ్జెట్‌ను హ్యాండ్‌బ్యాగ్‌లో తీసుకెళ్లవచ్చు. ప్యాంట్‌ పాకెట్‌లోనూ పెట్టుకోవచ్చు. ఈ గ్యాడ్జెట్‌కున్న పిన్‌ను లాగేస్తే చాలు... అలారం యాక్టివేట్‌ అవుతుంది. దీనికున్న లెడ్‌ లైట్‌ను చీకట్లో  టార్చ్‌లా ఉపయోగించవచ్చు. ఈ గ్యాడ్జెట్‌ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. 




స్మార్ట్‌ లాకెట్‌

మెడలో వేసుకుంటే సాధారణ లాకెట్‌ మాదిరిగానే ఉంటుంది. కానీ మీరు ఆపదలో ఉన్నప్పుడు ఈ ‘సేఫర్‌’ లాకెట్‌పై డబల్‌ క్లిక్‌ చేస్తే చాలు. ఆటోమెటిక్‌గా స్నేహితులు, కుటుంబసభ్యులకు అలర్ట్‌ మెసేజ్‌ వెళ్లిపోతుంది. జీపీఎస్‌ ఫీచర్‌ ఉన్న ఈ లాకెట్‌ మీ లొకేషన్‌ను సైతం పంపిస్తుంది.




జస్ట్‌ ప్రెస్‌

ఈ గ్యాడ్జెట్‌ను చేతికి ధరించవచ్చు. చూస్తే సాధారణ గడియారంలా, గాజులా కనిపిస్తుంది. కానీ ఆపత్కాలంలో దీనికి ఉన్న బటన్‌ను ప్రెస్‌ చేస్తే అత్యవసర సందేశం వెళ్లిపోతుంది. సెల్‌ఫోన్‌తో ఇది సింక్రనైజ్‌ అయి ఆడియో రికార్డింగ్‌ చేస్తుంది. మహిళల చేతికి ఉండాల్సిన ‘సేఫ్‌లెట్‌’ గ్యాడ్జెట్‌ ఇది.




సెల్ఫ్‌ డిఫెన్స్‌ కీ చెయిన్‌

చూస్తే కీ చెయిన్‌లానే ఉంటుంది. కానీ అత్యవసర సమయాల్లో ఆత్మరక్షణ కోసం పర్సనల్‌ వెపన్‌గా ఉపయోగపడుతుంది. ఇది ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందంటే కిటికీ అద్దాన్ని సైతం దీంతో బద్దలు కొట్టవచ్చు. మీపై దాడికి ప్రయత్నించిన వారిని ఈ కీ చెయిన్‌తో గాయపరిచి సురక్షితంగా బయటపడొచ్చు. 




పెన్నే కానీ గన్నుతో సమానం

సాధారణ పెన్నులా రాసుకోవచ్చు. అపద సమయంలో ఆయుధంగా వాడుకోవచ్చు. ఇదీ ‘అటామిక్‌ బేర్‌ టాక్టికల్‌ పెన్‌’ ప్రత్యేకత. మిలిటరీ గ్రేడ్‌ అల్యూమీనియంతో తయారైన ఈ పెన్నుతో కారు అద్దాలను సైతం సులభంగా పగలగొట్టవచ్చు. భద్రత విషయంలో ఆందోళన చెందే మహిళలు ఈ పెన్నును చెంత ఉంచుకోవాల్సిందే. ఆన్‌లైన్‌ స్టోర్స్‌లో అందుబాటులో ఉంది.

Updated Date - 2020-03-07T07:55:38+05:30 IST