కోల్‌కతా విమానాశ్రయానికి వచ్చే విజిటర్లపై నిషేధం

ABN , First Publish Date - 2021-08-11T23:22:02+05:30 IST

కేంద్ర భద్రతా సంస్థల హైఅలర్ట్ నేపథ్యంలో కోల్‌కతా విమానాశ్రయానికి వచ్చే విజిటర్లపై నిషేధం..

కోల్‌కతా విమానాశ్రయానికి వచ్చే విజిటర్లపై నిషేధం

కోల్‌కతా: కేంద్ర భద్రతా సంస్థల హైఅలర్ట్ నేపథ్యంలో కోల్‌కతా విమానాశ్రయానికి వచ్చే విజిటర్లపై నిషేధం విధించారు. ఈనెల 20 వరకూ ఈ నిషేధం అమలులో ఉంటుంది. స్వాంతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రతా సంస్థల తాజా హెచ్చరికల్లో భాగంగా కోల్‌కతా విమానాశ్రయానికి సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బ్యూరో అప్రమత్తం చేసింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలు, ఇతర సివిల్ ఏవియేషన్ ఇన్‌స్టలేషన్ల వద్ద కూడా భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు.


సవరించిన సెక్యూరిటీ ప్రోటాకాల్ ప్రకారం, ఎయిర్ టిక్కెట్లు ఉన్న వారు, రెగ్యులర్ విమాశ్రయ సిబ్బంది, ఎయిర్‌లైన్, భద్రతా సిబ్బందిని మాత్రమే టెర్మినల్ భవంతిలోకి అనుమతిస్తారు. ప్రయాణికులతో వచ్చే వారికి, విమాశ్రయంలో పనుల నిమిత్తం వచ్చే వారికి జారీచేసే పాసులను తాత్కాలికంగా నిలిపేస్తారు. సీఐఎస్ఎఫ్ సైతం విమానాశ్రయం వద్ద అదనపు సాయుధ బలగాలను మోహరించింది. విమానాశ్రయం వెలుపల, బయట స్థానిక పోలీసుల మోహరింపు 40 శాతం పెంచారని, దీనికి అదంగా సీఐఎస్ఎఫ్ బలగాలను 23 శాతం పెంచినట్టు సీఐఎస్ఎఫ్ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2021-08-11T23:22:02+05:30 IST