కశ్మీర్‌లో రాళ్లు విసిరితే ‘సెక్యూరిటీ క్లియరెన్స్‌’ నో

ABN , First Publish Date - 2021-08-02T07:09:33+05:30 IST

రాళ్లు విసిరే వాళ్లకు పాస్‌పోర్టు, ఇతర ప్రభు త్వ సేవల కోసం అవసరమయ్యే ‘సెక్యూరిటీ క్లియరెన్స్‌’ను ఇవ్వబోమని జమ్మూకశ్మీర్‌ పోలీసులు హెచ్చరించారు.

కశ్మీర్‌లో రాళ్లు విసిరితే ‘సెక్యూరిటీ క్లియరెన్స్‌’ నో

శ్రీనగర్‌/జమ్మూ, ఆగస్టు 1: రాళ్లు విసిరే వాళ్లకు పాస్‌పోర్టు, ఇతర ప్రభు త్వ సేవల కోసం అవసరమయ్యే ‘సెక్యూరిటీ క్లియరెన్స్‌’ను ఇవ్వబోమని జమ్మూకశ్మీర్‌ పోలీసులు హెచ్చరించారు. రాళ్లు విసిరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ‘సెక్యూరిటీ క్లియరెన్స్‌’ను తిరస్కరించాలని సీఐడీ ఉన్నతాధికారులు ఆదేశించారు. క్లియరెన్స్‌ ఇచ్చే సమయంలో ఆ వ్యక్తి నేరచరిత్రను పూర్తిగా అధ్యయనం చేయాలని, పోలీసులు, భద్రతా బలగాలు, భద్రతా సం స్థల అధీనంలోని సీసీటీవీ ఫుటేజీలు, వీడియోలు, ఆడియోలను పరిశీలించా లని సూచించారు. దేశానికి వ్యతిరేకంగా కుట్రపన్నే వారికి ఈ నిర్ణయం ఒక గుణపాఠమని కశ్మీర్‌ బీజేపీ చీఫ్‌ రవీందర్‌ రైనా అన్నారు.

Updated Date - 2021-08-02T07:09:33+05:30 IST