Abn logo
Apr 8 2021 @ 22:30PM

వైఎస్ షర్మిలకు భద్రత పెంపు

హైదరాబాద్: వైఎస్ షర్మిలకు తెలంగాణ ప్రభుత్వం భద్రత కల్పించింది. నలుగురు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని ఆమెకు కేటాయించింది. షర్మిల ఖమ్మంలో శుక్రవారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఆమె పెట్టబోయే పార్టీ పేరును కూడా ఖమ్మం సభలోనే ప్రకటించనున్నారు. ఇప్పటికే సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ సభకు ప్రభుత్వం ఆంక్షలతో కూడిన అనుమతులు మంజూరు చేసింది. తెలంగాణ జిల్లాల వైఎస్ అభిమానులు, కార్యకర్తలతో సమ్మేళనాలు నిర్వహించిన షర్మిల.. వైఎస్ ఆశయాల కోసమే తాను పార్టీ పెడుతున్నట్లు తెలిపారు. ఇక ఖమ్మం సభకు ముఖ్య అతిథిగా వైఎస్ విజయమ్మ హాజరుకానున్నారని సమాచారం. 

ఇవి కూడా చదవండిImage Caption

షర్మిల సంకల్ప సభకు ఆంక్షలురేపే ఖమ్మంలో షర్మిల సంకల్ప సభ

Advertisement
Advertisement
Advertisement