జమ్మూకశ్మీర్‌‌లో ఉగ్రవాదుల రహస్యస్థావరం గుట్టురట్టు

ABN , First Publish Date - 2020-06-04T17:02:41+05:30 IST

జమ్మూకశ్మీర్ లోని కిష్టావర్ జిల్లా చిచాచా అడవుల్లో ఉగ్రవాదుల రహస్యస్థావరం గుట్టును భారత సైనికులు రట్టు చేశారు....

జమ్మూకశ్మీర్‌‌లో ఉగ్రవాదుల రహస్యస్థావరం గుట్టురట్టు

ఆయుధాలు స్వాధీనం

కిష్టావర్ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీర్ లోని కిష్టావర్ జిల్లా చిచాచా అడవుల్లో ఉగ్రవాదుల రహస్యస్థావరం గుట్టును భారత సైనికులు రట్టు చేశారు. భారత సైనికులు జమ్మూకశ్మీర్ పోలీసులతో కలిసి అడవుల్లో గాలించారు. చిచాచా అడవుల్లో ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ఆయుధాలు దాచి ఉంచారని సైనికుల గాలింపులో తేలింది. ఉగ్రవాదుల రహస్య ఆయుధాగారంలో ఏకే 56 రైఫిల్, 27 రౌండ్ల ఒక మేగజైన్, ఒన్ బ్యారల్ గ్రెనేడ్ లాంచర్, 9 ఎంఎం పిస్టల్, ఆరు రౌండ్లతో కూడిన ఒక పిస్టల్ మేగజైన్ లను  ఆర్మీ స్వాధీనం చేసుకుంది. పుల్వామా జిల్లాలో గత నెల ఉగ్రవాదుల మరో రహస్యస్థావరాన్ని కనుగొన్నారు. 


Updated Date - 2020-06-04T17:02:41+05:30 IST