చైనాలో విద్యార్థులకు కత్తిపోట్లు

ABN , First Publish Date - 2020-06-05T06:33:41+05:30 IST

ఉన్మాదంతో ఓ పాఠశాల సెక్యూరిటీ గార్డు కత్తితో విరుచుకుపడ్డ ఘటనలో.. 40 మంది విద్యార్థులు, ప్రిన్సిపాల్‌, సిబ్బంది, మరో సెక్యూరిటీ గార్డు గాయాలపాలయ్యారు. ఈ ఘటన చైనాలోని గవాంక్షీ రాష్ట్రం వూజౌ నగరంలో చోటుచేసుకుంది...

చైనాలో విద్యార్థులకు కత్తిపోట్లు

  • సెక్యూరిటీ గార్డు ఘాతుకం
  • ప్రిన్సిపాల్‌ పరిస్థితి విషమం

బీజింగ్‌, జూన్‌ 4: ఉన్మాదంతో ఓ పాఠశాల సెక్యూరిటీ గార్డు కత్తితో విరుచుకుపడ్డ ఘటనలో.. 40 మంది విద్యార్థులు, ప్రిన్సిపాల్‌, సిబ్బంది, మరో సెక్యూరిటీ గార్డు గాయాలపాలయ్యారు. ఈ ఘటన చైనాలోని గవాంక్షీ రాష్ట్రం వూజౌ నగరంలో చోటుచేసుకుంది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా 31 ఏళ్ల క్రితం చైనాలోని తియానన్మెన్‌ స్క్వేర్‌ వద్ద ఆందోళనకారుల ఊచకోతను చైనా మరోమారు సమర్థించుకుంది. 1989, జూన్‌ 4న జరిగిన ఈ ఘటనకు శుక్రవారానికి సరిగ్గా 31 ఏళ్లు. దీనిపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జౌ లిజియాన్‌ మాట్లాడుతూ ‘‘రాజకీయ అస్థిరత కోసమే తియానన్మెన్‌ స్క్వేర్‌ ఆందోళన జరిగింది. ఆ సమయంలో చైనా సర్కారు పూర్తిస్థాయిలో సరైన నిర్ణయం తీసుకుంది’’ అని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-06-05T06:33:41+05:30 IST