నూతన కలెక్టర్‌ భవనంలో భద్రతా చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-01-25T05:48:02+05:30 IST

నూతనంగా నిర్మిస్తున్న సమీకృత జిల్లా కలెక్టర్‌ కార్యాలయ భవనానికి భద్రతా చర్యలు తీసుకోవా లని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు తెలిపారు.

నూతన కలెక్టర్‌ భవనంలో భద్రతా చర్యలు తీసుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు

- వివిధ శాఖల అధికారుల సమీక్షలో కలెక్టర్‌ వెంకట్రావు


మహబూబ్‌ నగర్‌ (కలెక్టరేట్‌), జనవరి 24 : నూతనంగా నిర్మిస్తున్న సమీకృత జిల్లా కలెక్టర్‌ కార్యాలయ భవనానికి భద్రతా చర్యలు తీసుకోవా లని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు తెలిపారు. విద్యుత్‌, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పటికీ ఇబ్బంది కలగకుండా అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. నూతన కార్యాలయంలో ఇంకా అక్క డక్కడా మిగిలిపోయిన పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించా రు. సోమవారం జిల్లా అధికారులతో  సమీక్షించారు. కార్యాలయ ఆవరణ లో సుందరీకరణలో భాగంగా పెద్ద మొక్కలు నాటడం, విద్యుత్‌ లైన్ల మార్పు, ముఖ్యంగా విద్యుత్‌ ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలను తీసుకోవాలని చెప్పారు. కార్యాలయంలో విద్యుత్తు, టెలి ఫోన్‌, ఇంటర్నెట్‌, ఇంటర్‌ కం సౌకర్యం, ఆయా కార్యాలయాల అధికారుల కు ట్రాన్స్‌కో ద్వారా ప్రత్యేక మీటర్ల కేటాయింపు తదితర అంశాలపై సమీ క్షించారు. పట్టణ రహదారి విస్తరణ, సుందరీకరణ, కూడళ్లలో సెంట్రల్‌ లైటింగ్‌, విద్యుత్‌ స్తంభాల మార్పిడిపై కూడా కలెక్టర్‌ జాతీయ రహదా రుల సంస్థ, ఆర్‌అండ్‌బీ, విద్యుత్‌ అధికా రులతో సమీక్షించారు. సమావే శానికి రెవెన్యూ అదనపు కలెక్టర్‌ కె. సీతారా మా రావు, ఆర్‌అండ్‌వీ ఎస్‌ఈ లింగారెడ్డి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ మూర్తి, ఈఈ స్వామి, జాతీయ రహ దారుల సంస్థ ఈఈ రాజేందర్‌, ఏఈ రమేశ్‌, అధికారులు హాజరయ్యారు.


ఆన్‌లైన్‌ ప్రజావాణికి 34 ఫిర్యాదులు


మహబూబ్‌ నగర్‌ (కలెక్టరేట్‌), జనవరి 24 : కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చేపట్టిన ఆన్‌లైన్‌ ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని కలెక్టర్‌ వెంకట్రా వు తెలిపారు. ఆన్‌లైన్‌ ద్వారా వచ్చిన ఫిర్యా దులకు కూడా ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరిం చాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ తన కార్యా లయంలో స్వయంగా ఆన్‌లైన్‌/ వాట్సాప్‌ ఫోన్‌ నెంబర్‌ 7330664001 ద్వారా స్వీకరిం చిన ఫిర్యాది దారులతో కలెక్టర్‌ మాట్లాడారు. వారు చెప్పిన సమస్యలను విని పరిష్కా రానికి చర్యలు తీసుకున్నారు. 34 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. కొవిడ్‌ కేసులు పెరు గుతున్న దృష్ట్యా ఆన్‌లైన్‌ ద్వారా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్ణయిం చడం జరిగిందని,  ఒక వేళ కేసులు తగ్గితే తిరిగి ప్రత్యక్షంగా నిర్వహిస్తామని కలెక్టర్‌ వెల్లడించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ కె. సీతారామారావు, ఆర్డీవో పద్మశ్రీ, ఏఓ ప్రేమ్‌రాజ్‌, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.


జాతీయ రహదారిపై మొక్కల పరిశీలన


రాజాపూర్‌/ బాలానగర్‌ : మండల కేంద్రంలోని స్థానిక జాతీయ రహ దారిపై నూతనంగా నాటుతున్న మొక్కలను సోమవారం కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు పరిశీలించారు. రహదారి వెంబడి నాటే ప్రతీ మొక్కను కపాడాలని సూచించారు. కొన్ని మొక్కలకు కలెక్టర్‌ నీరు పట్టారు. కార్యక్ర మంలో ఎంపీడీవో లక్ష్మీదేవి, ఎంపీవో వెంకట్‌రాములు, ఏపీవో భారతి, పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్‌ నాయక్‌, రవికుమార్‌ పాల్గొన్నారు. బాలానగర్‌ మండల కేంద్రంలోని కేతిరెడ్డిపల్లి వద్ద జాతీయ రాహదారిపై మొక్కలను పరిశీలించారు. 

Updated Date - 2022-01-25T05:48:02+05:30 IST