ధరణి సేవల్లో సమస్యలు లేకుండా చూడండి

ABN , First Publish Date - 2020-10-21T06:14:09+05:30 IST

ధరణి సేవలు నిర్వహణలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా డెమో సాఫ్ట్‌వేర్‌పై బాగా ప్రాక్టీస్‌ చేయాలని గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌, ధరణి ప్రత్యేక అధికారి క్రిస్టినా జడ్‌ చోంగ్తు అన్నారు

ధరణి సేవల్లో సమస్యలు లేకుండా చూడండి

ప్రత్యేక అధికారి క్రిస్టినా జడ్‌ చోంగ్తు


కొత్తగూడెం, అక్టోబరు 20: ధరణి సేవలు నిర్వహణలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా డెమో సాఫ్ట్‌వేర్‌పై బాగా ప్రాక్టీస్‌ చేయాలని గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌, ధరణి ప్రత్యేక అధికారి క్రిస్టినా జడ్‌ చోంగ్తు అన్నారు. ధరణి సేవలు నిర్వహణకు జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమితులైన ఆమె మంగళవారం కలెక్టరేట్‌ సమావేశపు హాలులో రెవెన్యూ, ఐటీడీఏ, అదనపు కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించి ధరణి పోర్టల్‌ నిర్వహణపై సన్నద్ధతను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... సమస్యలు లేకుండా ధరణి కార్యక్రమం ని ర్విరామంగా నిర్వహించేందుకు ప్రతి రోజు తహసీల్దార్లు డెమో సాఫ్ట్‌ వేర్‌ ద్వారా ప్రాక్టీస్‌ చేసి వచ్చిన సమస్యలపై ఉదయం, సాయంత్రం నివేదికలు అందజేయాలన్నారు. మారుమూల ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వ ఆదేశాలు మేరకు చకచకా ఏర్పాట్లు చేయడం పట్ల జిల్లా కలెక్టర్‌ను అభినందించారు. నాలుగు రోజుల వ్యవధిలో నెట్‌ వర్క్‌ సేవలు, తహసీల్దార్‌ కార్యాలయాల్లో సాంకేతిక పరిజ్ఞానం ఏర్పాటు, ధరణి ఆపరేటర్ల నియా మకం చేసి డెమో సాఫ్ట్‌ వేర్‌ ద్వారా శిక్షణ పొందుతున్నారని తెలిపారు.


జిల్లాలో కొత్తగూడెం డివిజన్‌లో 159, భద్రాచలం డివిజన్‌లో 218 మొత్తం 377 గ్రామాల్లో 15,0430 ధరణి ఖాతాలున్నాయని వాటిలో 11,8,103 వ్యవసాయ భూముల ఖాతాలున్నాయని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు డెమో సాఫ్ట్‌ వేర్‌ ద్వారా 349 స్లాట్స్‌ బుక్‌చేసి 311 మాడుల్స్‌ విజయవంతంగా పూర్తిచేశారని తెలిపారు. 25వ తేదీన ప్రారంభించనున్న ధరణి పోర్టల్‌ నిర్వహణలో జిల్లాలో చేసిన ఏర్పాట్లు పరిశీలనకు వచ్చానని, ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నట్లు ఆమె చెప్పారు. రిజిస్ట్రేషన్‌ సేవలు సులభతరం కావాలన్న లక్ష్యంతో ప్రజల సౌకర్యార్ధం ప్రభు త్వం ధరణి పోర్టల్‌ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్‌ ఎంవీ. రెడ్డి మాట్లాడుతూ... జిల్లాలో ధరణి సేవలు నిరంతరాయంగా నిర్వహించేందుకు తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఏర్పాట్లు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. కలెక్టరేట్‌లో డీఆర్వో అశోక చక్రవర్తి, ఇన్‌ఛార్జీ ఏవో గన్యా, తహసీల్దార్‌ శివయ్య, భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ పరిపా లనాధికారి రాజేంద్రప్రసాద్‌లను పర్యవేక్షణ అధికారులుగా నియమించినట్లు తెలిపారు. అలాగే జీ. వెంకటేశ్వర్లును ధరణి జిల్లా సమన్వయకర్తగా నియమించినట్లు చెప్పారు. 

Updated Date - 2020-10-21T06:14:09+05:30 IST