ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడండి

ABN , First Publish Date - 2021-11-29T06:25:37+05:30 IST

భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి.. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ప్రత్యేకాధికారి ప్రద్యుమ్న ఆదేశించారు.

ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడండి
రైతులతో మాట్లాడుతున్న ప్రద్యుమ్న

అధికారులకు ప్రత్యేకాధికారి ఆదేశం


రామచంద్రాపురం, నవంబరు 28: భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి.. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ప్రత్యేకాధికారి ప్రద్యుమ్న ఆదేశించారు. ఆర్సీపురం మండలంలోని రాయలచెరువు మొరవపనులను ఆదివారం కలెక్టర్‌ హరినారాయణన్‌తో కలిసి పరిశీలించారు. చెరువు ఇన్‌ఫ్లో, అవుట్‌ ఫ్లో వివరాలను అడిగి, తెలుసుకున్నారు. మొరవకాలువలు, చెరువు తూముల ద్వారా మూడు వేల క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేసి, చెరువు నీటిమట్టం మూడు అడుగుల లోతు తగ్గించామని కలెక్టర్‌ తెలియజేశారు. గండ్లను పూడ్చివేసి, చెరువుకట్టను పటిష్ఠం చేశామని వివరించారు. అనంతరం చెరువుకాల్వ మొరవ పూడకుండా శాశ్వత రివిట్మెంట్‌ కట్టాలని రైతులు కోరారు. మరో రైతు తన పట్టాభూముల్లో మొరవకాలువ తీశారని, నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఇరిగేషన్‌ ఈఈ వెంకటశివారెడ్డి, ఇండస్ర్టీస్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ప్రతాపరెడ్డి, ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి, ఎంపీటీసీ కృష్ణవేణి పాల్గొన్నారు.  

Updated Date - 2021-11-29T06:25:37+05:30 IST