నాసిరకం విత్తనాలతో నష్టం

ABN , First Publish Date - 2021-10-17T06:26:06+05:30 IST

ఖరీఫ్‌ వరిసాగులో నాసిరకం విత్తనాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని, ఇందుకు బాధ్యులైన డిస్ట్రిబ్యూటర్‌ను తక్షణమే అరెస్ట్‌ చేయాలని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌ డిమాండ్‌ చేశారు.

నాసిరకం విత్తనాలతో నష్టం

జనసేన జిల్లా అధ్యక్షుడు దుర్గేష్‌
సర్పవరం జంక్షన్‌, అక్టోబరు 16: ఖరీఫ్‌ వరిసాగులో నాసిరకం విత్తనాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని, ఇందుకు బాధ్యులైన డిస్ట్రిబ్యూటర్‌ను తక్షణమే అరెస్ట్‌ చేయాలని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌ డిమాండ్‌ చేశారు.  కాకినాడ నాగమల్లితోట ముత్తాక్లబ్‌లో పీఏసీ సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహీంద్ర సీడ్స్‌ వారి అమూల్య వరి రకం నకిలీ విత్తనాలకు సంబంధించి పిఠాపురం ఏఎంసీ యార్కెట్‌ చైర్మన్‌, వైసీపీ నాయకుడు అయిన డిస్ట్రిబ్యూటర్‌ని తక్షణం అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలో కాకినాడ పార్లమెంట్‌ పరిధిలో 13 మండలాల్లో సుమారు 9 వేల ఎకరాల్లో నాసిరకం విత్తనాల కారణంగా పంట నష్టపోయారని ఆరోపించారు. నాసిరకం విత్తనాలతో నష్టపోయిన రైతుల విషయంలో మంత్రి కన్నబాబు బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయించాలని డిమాండ్‌ చేశారు. రైతులకు న్యాయం జరక్కపోతే న్యాయం జరిగే వరకు పోరాటం ఉధృతం చేస్తామన్నారు. అనంతరం జిల్లాకు చెందిన పీఏసీ సభ్యులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలతో మండల కమిటీ నియామకం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. పీఏసీ సభ్యులు పితాని బాలకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, తాటికాయల వీరబాబు, బి.గంగాధర్‌, కరెడ్ల గోవిందు, ఆట్ల సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-17T06:26:06+05:30 IST