దేవుణ్ణి చూశాను!

ABN , First Publish Date - 2020-03-31T09:15:51+05:30 IST

దేవుణ్ణి చూశాను అవును నిజం నేను దేవుణ్ణి చూశాను ప్రాణాలను లెక్కచేయక పొరుగువాడిని కాపాడేందుకు ఆసుపత్రిలో అహరహం శ్రమించే...

దేవుణ్ణి చూశాను!

దేవుణ్ణి చూశాను

అవును నిజం

నేను దేవుణ్ణి చూశాను

ప్రాణాలను లెక్కచేయక

పొరుగువాడిని కాపాడేందుకు

ఆసుపత్రిలో అహరహం శ్రమించే

వైద్యుడిలో నేను దేవుణ్ణి చూశాను


ఖాకీ చొక్కాతో కాఠిన్యాన్ని

తొడుక్కొని, లాఠీతోనే భయపెడుతూ

అందరూ బాగుండాలని రోడ్డుమీద

పొద్దస్తమానం పహారా కాస్తున్న

పోలీసులో నేను దేవుణ్ణి చూశాను


మాయరోగం దేశమంతా కమ్మేసి

అందరినీ ఇంటికే పరిమితం చేసినా,

స్వచ్ఛతే మా మతమంటూ

శుభ్రతే మా కులమంటూ

ప్రాణాలకు తెగిస్తున్న

పారిశుద్ధ్య కార్మికుడిలో

నేను దేవుణ్ణి చూశాను


కాలం అలా నిలిచిపోయినా,

జీవితం స్తంభించినా

చీకటి మీ ఇంటి గుమ్మం

తొక్కనివ్వనంటూ

వెలుగులు పంచే

కరెంటన్న కళ్లల్లో

నేను దేవుణ్ణి చూశాను


కాలమెంత కఠినమైనా

రోజులెంత దుర్భరమైనా

దేశానికి అన్నం పెట్టేందుకు

పంటపొలంలో కాయకష్టంచేసే

రైతన్న చెమట చుక్కలో

నేను దేవుణ్ణి చూశాను


దేవుణ్ణి చూశాను

అవును నిజం

నేను దేవుణ్ణి చూశాను

ప్రజలకు కష్టమొస్తే

ప్రళయమే ముంచుకొస్తే

తానే ఓ సైన్యమై

పాలనలో చైతన్యమై

రాష్ట్రాన్ని, దేశాన్ని

నడిపించే నాయకుడిలో

నేను దేవుణ్ణి చూశాను

అవును నిజం

నేను దేవుణ్ణి చూశాను.

చక్రవర్తి గుంటుక

Updated Date - 2020-03-31T09:15:51+05:30 IST