Abn logo
May 21 2020 @ 15:08PM

ఇకపై అలాంటి సీన్లు తగ్గుతాయేమో: సీరత్ కపూర్

లాక్‌డౌన్ తర్వాత సినిమాల చిత్రీకరణలో, పాటల చిత్రీకరణలో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయని హీరోయిన్ సీరత్ కపూర్ అభిప్రాయపడింది. `రన్ రాజా రన్`, `టచ్ చేసి చూడు`, `ఒక్క క్షణం` వంటి పలు తెలుగు సినిమాల్లో నటించిన సీరత్ తాజాగా `ఏబీఎన్-ఆంధ్రజ్యోతి`తో మాట్లాడింది. లాక్‌డౌన్ గురించి, షూటింగ్‌ల గురించి స్పందించింది.


`ఇకపై సినిమా చిత్రీకరణలో మార్పులు రావొచ్చు. కౌగలింత, ముద్దు సీన్లు తెరకెక్కించడం తగ్గుతుందేమో. గ్రూప్ డ్యాన్సర్లతో పాటలను చిత్రీకరించడం కష్టమవుతుంది. శానిటైజర్లు వాడడం, తరచుగా డ్యాన్స్ గ్రూప్స్‌ను మార్చడం, షవర్లను ఏర్పాటు చేయడం, పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం వంటి చర్యలు చేపడుతూ గ్రూప్ సాంగ్స్ చిత్రీకరించాల్సి ఉంటుంది. ఏదేమైనా కరోనా మనకు చాలా నేర్పించింది. శుభ్రత విషయంలోనూ, బయటి తిండి విషయంలోనూ బోలెడన్ని గుణపాఠాలు నేర్పింద`ని సీరత్ అభిప్రాయపడింది. 



Advertisement
Advertisement
Advertisement