Abn logo
Sep 13 2021 @ 10:16AM

చిన్నారిపై హత్యాచారం జరిగినా ప్రభుత్వం స్పందించలేదు: సీతక్క

హైదరాబాద్: హైదరాబాద్ నగరం నడిబొడ్డున చిన్నారిపై హత్యాచారం జరిగినా.. ప్రభుత్వం స్పందించలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు. నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. గిరిజన బిడ్డకి అన్యాయం జరిగితే గిరిజన ఎమ్మెల్యేలు సైతం మాట్లాడకపోవడం ప్రభుత్వ తీరుకు నిదర్శనమని సీతక్క పేర్కొన్నారు.