నిషేధిత గ్లైఫోసెట్ పట్టివేత

ABN , First Publish Date - 2021-07-28T03:22:41+05:30 IST

జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో నిషేధిత గ్లైఫోసెట్ గడ్డిమందును పోలీసులు

నిషేధిత గ్లైఫోసెట్ పట్టివేత

మంచిర్యాల: జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో నిషేధిత గ్లైఫోసెట్ గడ్డిమందును పోలీసులు పట్టుకున్నారు. తాళ్ల గురిజాల పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న బుదా గ్రామంలో నిషేధిత  గ్లైఫోసెట్ ( గడ్డిమందు )అమ్ముతున్నారనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో అక్కడ పోలీసులు దాడి చేసి 70 లీటర్ల గడ్డి మందును స్వాధీనం చేసుకున్నారు. గ్లైఫోసెట్‌ను అమ్ముతున్న ఇద్దరిని త్రీ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


Updated Date - 2021-07-28T03:22:41+05:30 IST