అక్రమంగా తరలిస్తున్న సారా, మద్యం స్వాధీనం

ABN , First Publish Date - 2020-06-05T11:29:23+05:30 IST

జిల్లావ్యాప్తంగా ఎక్సైజ్‌ అధికారులు, పోలీసులు గురువారం జరిపిన దాడులు, తనిఖీల్లో ..

అక్రమంగా తరలిస్తున్న సారా, మద్యం స్వాధీనం

నిడదవోలు/దేవరపల్లి/జీలుగుమిల్లి/కాళ్ల/ఆకివీడు, జూన్‌ 4: జిల్లావ్యాప్తంగా ఎక్సైజ్‌ అధికారులు, పోలీసులు గురువారం జరిపిన దాడులు, తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యం, సారా స్వాధీనం చేసుకున్నారు. నిడదవోలు మండలం కంసాలి పాలెం పరిధిలో కొయ్యే సత్తిబాబు, కొండేటి అన్నవరంలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి పది లీటర్ల సారా, మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు కొవ్వూరు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.శ్రీనివాసరావు తెలిపారు. దేవరపల్లి మండలం పల్లంట్ల కొత్తపేటలో కొమారపు చిన్నకోట సత్యనారాయణ, కొమారపు రామారావు సారా తయారు చేస్తున్నారన్న సమాచారంతో పోలీసుల దాడి చేశారు. ఏడు లీటర్ల సారా స్వాధీనం చేసుకుని సత్యనారాయణను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్‌ఐ స్వామి తెలిపారు.


రామారావు పరారైనట్టు తెలిపారు. తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న నలుగురిపై కేసు నమోదు చేసినట్టు జీలుగుమిల్లి ఎస్‌ఐ కె.విశ్వనాథ్‌ తెలిపారు. నెర్సుగూడెం సమీ పంలోని తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట నుంచి వేర్వేరుగా నలుగురు మద్యం సీసాలు తరలిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకుని రూ.13,650 విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ చెప్పారు. అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిని కాళ్ళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బొండాడ  పెదపేటకు చెందిన చిలకపాటి రత్నరాజు మద్యం అమ్మకాలు సాగిస్తున్నాడంటూ సమాచారం రావడం తో సిబ్బందితో దాడులు నిర్వహించి అతని వద్ద నుంచి ఆరు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఆకివీడు గంగానమ్మకోడు ఏరియాలో సారా, మద్యం అమ్ముతున్న మేకల రాము దగ్గర 2.5 లీటర్ల సారా, 18 క్వార్టర్ల మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ వీరభద్రరావు తెలిపారు.


Updated Date - 2020-06-05T11:29:23+05:30 IST