22 కిలోల గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2021-10-22T07:06:52+05:30 IST

విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్న అరకుకు చెందిన కొర్ర ఆనంద్‌, ఒడిశా రాష్ట్రానికి చెందిన గుంట కృష్ణలను నల్లగొండ-దేవరకొండ ప్రధాన రహదారిపై కనగల్‌ వాగు బ్రిడ్జి సమీపంలో చండూరు సీఐ డి.మధు ఆధ్వర్యంలో ఎస్‌ఐ సతీష్‌రెడ్డి గురువారం పట్టుకున్నారు.

22 కిలోల గంజాయి పట్టివేత
గంజాయితో పట్టుబడిన నిందితులు

కనగల్‌, అక్టోబరు 21: విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్న అరకుకు చెందిన కొర్ర ఆనంద్‌, ఒడిశా రాష్ట్రానికి చెందిన గుంట కృష్ణలను నల్లగొండ-దేవరకొండ ప్రధాన రహదారిపై కనగల్‌ వాగు బ్రిడ్జి సమీపంలో చండూరు సీఐ డి.మధు ఆధ్వర్యంలో ఎస్‌ఐ సతీష్‌రెడ్డి గురువారం పట్టుకున్నారు. నిందితుల వద్ద 22 కిలోల గంజాయి బ్యాగుతోపాటు ఓ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్‌ శ్రీనివాస్‌రావు సమక్షంలో రెవెన్యూ సిబ్బంది పి.ప్రసాద్‌, రామచందర్‌రావులు పంచనామా నిర్వహించారు. అనంతరం వీరిద్దరిని రిమాండ్‌కు తరలించారు. జాతీయ రహదారిపై పోలీసుల తనిఖీలు పెరిగిన నేపథ్యంలో వీరు రూట్‌మార్చి గంజాయిని హైదరాబాద్‌కు తరలిస్తున్నారని ఎస్‌ఐ వివరించారు. 


గంజాయి విక్రేతల అరెస్ట్‌

నాగార్జునసాగర్‌: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించినట్లు సాగర్‌ సీఐ గౌరునాయుడు, ఎస్‌ఐ నరసింహారావులు తెలిపారు. గురువారం వారు విలేకరులతో మాట్లాడారు. ఈనెల 19వ తేదీన గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల గ్రామానికి చెందిన సంకురాతిరి అంజమ్మ సాగర్‌ ఫైలాన్‌ కాలనీ బస్టాండ్‌ అవరణలో అనుమానాస్పదంగా తిరుగుతుంది. అయితే మెను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా, రెండు కిలోల గంజాయి విక్రయిం చడానికి వచ్చినట్లు పోలీసులకు తెలిపింది. దీంతో సదరు మహిళను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. అనంతరం సదరు మహిళ ఇచ్చిన సమాచారం మేరకు గురువారం రెండు బస్తాల్లో 20కిలోల గంజాయిని అమ్మడానికి తీసుకువెళుతున్న ఏలూరు పట్టణానికి చెందిన వల్లముల హనుమంత రావు, గాలం శ్రీనివాస్‌రావులను హిల్‌కాలనీ వద్ద అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. 

Updated Date - 2021-10-22T07:06:52+05:30 IST