80 ఎర్రచందనం దుంగలు పట్టివేత

ABN , First Publish Date - 2021-05-08T04:56:48+05:30 IST

ఐచర్‌ వాహనంలో అరటి కాయల లోడు మాటున అక్రమంగా తరళిస్తున్న 80 ఎర్రచందనం దుంగలను శుక్రవారం బాలపల్లె రేంజి అటవీశాఖాధికారులు బాలపల్లె చెక్‌పోస్టు వద్ద దాడులు చేసి పట్టుకున్నారు.

80 ఎర్రచందనం దుంగలు పట్టివేత
ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసిన బాలపల్లె అటవీశాఖ అధికారులు, సిబ్బంది

ఐచర్‌ వాహనం స్వాధీనం ఫ ఇద్దరు స్మగ్లర్ల అరెస్టు


రైల్వేకోడూరు, మే 7: ఐచర్‌ వాహనంలో అరటి కాయల లోడు మాటున అక్రమంగా తరళిస్తున్న 80 ఎర్రచందనం దుంగలను శుక్రవారం బాలపల్లె రేంజి అటవీశాఖాధికారులు బాలపల్లె చెక్‌పోస్టు వద్ద దాడులు చేసి పట్టుకున్నారు. బాలపల్లె రేంజర్‌ ఈ.జే శ్రీనువాసులురెడ్డి కథనం మేరకు... రైల్వేకోడూరు మండలంలోని మొలకలపోడు గ్రామానికి చెందిన కనుపర్తి హరిబాబు, నందలూరు మండలంలోని యల్లంరాజుపల్లెకు చెందిన కొవ్వూరు హరిక్రిష్ణ అనే స్మగ్లర్లు ఏపీ 03టీఏ 6462 అనే నెంబరు గల ఐచర్‌ వాహనంలో అరటి కాయలలోడు మాటున 80 ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరళిస్తుండగా రాబడిన సమాచారం మేరకు దాడులు చేసి చెక్‌ పోస్టు వద్ద పట్టుకున్నట్లు ఆయన వివరించారు. 80 ఎర్రచందనం దుంగలు విలువ రూ.1కోటి ఉంటుందని బ్లాక్‌ మార్కెట్‌ అంచనా. స్మగ్లర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో బాలపల్లె రేంజి ఎఫ్‌ఎ్‌సవో ఎం. బాలచంద్రుడు, ఎఫ్‌బీవో యల్లప్ప, ఏబీవో ఏ.సుబ్బారెడ్డి, బాలపల్లె అటవీశాఖ చెక్‌పోస్టు, ప్రొటక్షన్‌ వాచర్లు  పాల్గొన్నారు.

Updated Date - 2021-05-08T04:56:48+05:30 IST