97 కిలోల గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2022-01-17T07:10:08+05:30 IST

జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్‌ పట్టణాల్లో 97 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కోదాడలోని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం..

97 కిలోల గంజాయి పట్టివేత
కోదాడలో వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్‌

కోదాడ/హుజూర్‌నగర్‌ జనవరి 16: జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్‌ పట్టణాల్లో 97 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కోదాడలోని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన సయ్యద్‌ అస్లాం పర్బాని తాలూకా లోహ గ్రామంలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గంజాయి తెచ్చి విక్రయిస్తే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చన్న ఆశతో అదే ప్రాంతంలో ని హోటల్‌ కార్మికులు హనుమాన్‌, లక్ష్మణ్‌రావు, రాహుల్‌తో ముఠాగా ఏర్పడ్డారు. ఏపీ రాష్ట్రం విశాఖలో  ఈ నెల 14న కిలో రూ.2 వేల చొప్పున 57 కేజీల గంజాయిని గుర్తు తెలియని వ్యక్తి నుంచి కొనుగోలు చేశారు.  50 గ్రాముల చొప్పున ప్యాకెట్లుగా చేశారు. మహారాష్ట్ర వెళ్లేందుకు  కోదాడలో బస్సు దిగి పోలీసుల తనిఖీలో పట్టుబ డ్డారు.  కోదాడలో  స్వాధీనం చేసుకున్న 57 కిలోల గంజాయి విలువు  బహిరంగ మార్కెట్‌లో రూ.11.40 లక్షలు ఉంటుందన్నారు. హుజూర్‌నగర్‌ పట్టణంలోని కొత్త బస్టాండ్‌ వద్ద 39కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు యువకులు మహ్మద్‌ నిజాం, అంజని తివారి, గాజీ ఏపీ రాష్ట్రం విజయనగరం జిల్లాలో గంజాయిని కొనుగోలు చేసి కోదాడకు వచ్చారు.   లారీ ఎక్కి హుజూర్‌నగర్‌లో దిగారు. బస్టాండ్‌ సమీపంలో పోలీసులు వారిని తనిఖీ చేసి  సుమారు రూ.4లక్షల విలువైన 39 కిలోల గంజాయిని పట్టుకొని నిందితులను అరెస్టు చేశారు. విలేకరుల సమావేశంలో సీఐలు సీఐ రామలింగారెడ్డి ఏ.నరసింహారావు, శివరామిరెడ్డి, ఎస్‌ఐలు క్రాంతికుమార్‌ పాల్గొన్నారు. 




Updated Date - 2022-01-17T07:10:08+05:30 IST