అలిపిరిలో మద్యం, గుట్కా స్వాధీనం

ABN , First Publish Date - 2021-03-14T01:37:08+05:30 IST

అక్రమంగా తరలిస్తున్న మద్యం, గుట్కాను విజిలెన్స్‌ సిబ్బంది

అలిపిరిలో మద్యం, గుట్కా స్వాధీనం

తిరుమల: అక్రమంగా తరలిస్తున్న మద్యం, గుట్కాను విజిలెన్స్‌ సిబ్బంది పట్టుకున్నారు. తిరుమల కొండపైకి నిషేధిత మద్యం, గుట్కాను తరలిస్తున్నారనే సమాచారం విజిలెన్స్‌ సిబ్బందికి అందింది. దీంతో అలిపిరి తనఖీ కేంద్రం వద్ద విజిలెన్స్‌ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. బైక్‌లో అక్రమంగా తరలిస్తున్న మద్యం, గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్ట్ చేశారు. వీటిని రవాణా చేస్తున్న వ్యక్తిని విజిలెన్స్‌ సిబ్బంది విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Read more